యువ

తళుకులీనిన ప్రాజెక్ట్ బెళుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలచంద్ర హెగ్డే, సన్నీ అరోకియా స్వామి, కుమారస్వామి, కొట్రేశ్ వీరాపూర్...నలుగురు కుర్రాళ్ల పేర్లు ఇవి. కర్ణాటకలోని ఎంఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిటెక్ చదివారు. ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుని స్థిరపడిపోదామని ఆలోచించకుండా దేశానికి ఏం చేయాలా అని ఆలోచించారు. అలాంటి ఆలోచనల్లోనే ఓసారి ఈ నలుగురూ ఉత్తర కన్నడ జిల్లా అయిన జోయిడాలోని మారుమూల గ్రామాలకు వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసి విస్తుపోయారు. ఎందుకంటే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ ఆ గ్రామాలకు కరెంటనేది లేదు. అంధకారంలో మగ్గుతున్న అక్కడి గ్రామస్థుల్ని చూడగానే తమకొక లక్ష్యం దొరికిందని భావించారు. తాము చదువుకున్న కాలేజీకి వెళ్లారు. అక్కడ ఓ 20మంది విద్యార్థులను ఎంచుకున్నారు. కార్యరంగంలోకి దిగారు. అంతా కలసి రెండు గ్రామాల్లోని 20 ఇళ్లలో వెలుగులు పూయించారు. ఇదంతా జరిగింది కేవలం నెలరోజుల కిందటే. రెండు గ్రామాలకు కరెంటు తెప్పించగానే వారి ప్రస్థానం ఆగిపోలేదు. భారతదేశంలో అంధకారంలో మగ్గుతున్న 11400 గ్రామాలను విద్యుదీకరించడమే లక్ష్యమంటున్న ఈ నలుగురు కుర్రాళ్ల స్ఫూర్తిదాయక ప్రస్థానం ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం....
జోయిడాలోని అటవీ గ్రామాలైన ఘటక్‌కునాంగ్, కుక్కుటె, కిండేల్ వంటి తొమ్మిది గిరిజన గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. వీటిలో రెండు గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంచుకున్నారు. దారితెన్నూ లేని ఈ గిరిజన గ్రామాలకు కరెంటు సౌకర్యం తెప్పించాలంటే సౌర విద్యుత్‌ద్వారానే సాధ్యమని భావించారు. ఒక్కో ఇంటికి సోలార్ పలకలు అమర్చాలి. మరికొంత సామగ్రి అవసరం. తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఉన్నాయి సరే. మరి డబ్బు సంగతి? దీనంతటికీ లక్షలు ఖర్చవుతాయి. ఎలా? నలుగురు కుర్రాళ్లూ తాము చదువుకున్న కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించారు. వారి ఆశయం గురించి తెలుసుకున్న ఎంఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం ఈ ప్రాజెక్టును స్పాన్సర్ చేయడానికి అంగీకరించింది. అలా ‘ప్రాజెక్ట్ బెళకు’ పట్టాలకెక్కింది. (బెళకు అంటే కన్నడంలో వెలుగు అని అర్థం). ఏప్రిల్ 7వ తేదీన ఏడుగురు కుర్రాళ్లు సమీపంలోని ధార్వాడ్‌కు వెళ్లి, కావలసిన పరికరాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాతి రెండు రోజుల్లో రెండు గ్రామాల్లోని 20 ఇళ్లను విద్యుదీకరించారు. వెలుగు జిలుగుల్లో తమ గ్రామాలను చూసి మురిసిపోయిన గ్రామస్థులు కుర్రాళ్లందరికీ తమకు తోచిన రీతిలో సన్మానం చేశారు. ఈ సంఘటన పత్రికలకెక్కింది. వారిపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇంతటితో తమ లక్ష్యం నెరవేరలేదంటున్నారు ఆ నలుగురు యువకులు. దేశవ్యాప్తంగా చీకటిలో మగ్గుతున్న గ్రామాల్లో విద్యుత్ రేఖలు ప్రసరింపజేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తామంటున్నారు వారు. సమాజానికి ఎంతో కొంత సాయం చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థలూ, ప్రభుత్వ సంస్థలూ, వ్యక్తులూ తమతో చేయి కలపాలని కోరుతున్నారు.
*