యువ

చాక్లెట్ ఇస్తే చాలు పాస్‌వర్డ్ చెప్పేస్తారట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహమాటం అనేది సార్వజనీనం. ఇక్కడ అక్కడ అని లేదు ఏ దేశమేగినా, ఎందుకాలిడినా మొహమాటస్తులకు కొదవ లేదట. ఇది ఓ సర్వేలో తేలిన నిజం. అయితే సర్వే జరిగింది మాత్రం మొహమాటం మీద కాదు. వ్యక్తుల మనస్తత్వాల మీద. చిన్న చిన్న బహుమతులకు చిన్న పిల్లలు ఆశ పడతారు. చాక్లెట్లకు, స్వీట్లకు ఆశపడే పెద్దవాళ్లుంటారా? ఉండరనే అనుకుంటాం కానీ ఉంటారని ఈ సర్వేలో తేలింది. అది కూడా చాక్లెట్ ఇస్తే...అందుకు బదులుగా కంప్యూటర్ లాగిన్ నేమ్, పాస్‌వర్డ్ కూడా చేప్పేసే పెద్దలు! విచిత్రంగా ఉంది కదూ!
అసలు విషయానికొస్తే...లక్సెంబర్గ్ యూనివర్శిటీకి చెందిన అధ్యయనవేత్త ఆండ్రె మెల్జెర్ ఆధ్వర్యంలో ఓ బృందం 1208మందిని సర్వే చేసింది. సర్వే ఫలితాలు ‘కంప్యూటర్ ఇన్ హ్యూమన్ బిహేవియర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కేవలం చిన్న చిన్న గిఫ్ట్‌లతో మొహమాటపెట్టి కీలక సమాచారాన్ని ఎలా రాబట్టుకోవచ్చో ఈ సర్వే కళ్లకు కట్టింది. సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది... చేతిలో ఓ చాక్లెట్ పెట్టగానే కరిగిపోయారట. కంప్యూటర్ పాస్‌వర్డ్, లాగిన్ నేమ్ వంటి వివరాలు కూడా చెప్పేశారట. ఎవరైనా మనకు ఏదైనా సాయం చేసినప్పుడు మనలో కృతజ్ఞతాభావం ఉప్పొంగుతుంది. ప్రత్యుపకారం చేయాలని మనసు తహతహలాడుతుంది. ఈ మొహమాటంలో కీలక సమాచారాన్ని చెప్పేందుకు వెనుకాడరనేది తమ సర్వేలో తేలిందన్నారు ఆండ్రె మెల్జెర్. సర్వేలో పాల్గొన్నవారి చేతిలో ముందుగానే చాక్లెట్ చేతిలో పెట్టి, ఆ తర్వాత మాటల్లోకి దింపి, కంప్యూటర్ పాస్‌వర్డ్‌ను అడిగితే నూటికి 43.5 మంది చెప్పేశారట. ముందు చాక్లెట్ ఇవ్వకుండా సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తే 29.8మంది మాత్రమే చెప్పేందుకు ఇష్టపడ్డారట.