యువ

డ్రోన్లతో ఉద్యోగాలకు ఎసరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ మానవుడి మనుగడను సులభతరం చేస్తోందా లేక మరింత కష్టాలపాల్జేస్తోందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. నాణేనికి రెండు పార్శ్వాలున్నట్టే, టెక్నాలజీకీ ఉన్నాయి. క్లిష్టతరమైన పనుల్ని సునాయాసంగా చేయడం, ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మలచివేయడం టె క్నాలజీవల్లనే సాధ్యమయ్యాయి కదా! అలాగని వెర్రిపుంతలు వేస్తున్న టెక్నాలజీ వల్ల మానవ విధ్వంసమూ అంతే సునాయాసమవుతోంది. ఈ సమస్యను అలా ఉంచితే నిన్న మొన్నటివరకూ వినిపించీ వినిపించనట్టుగా, కనిపించీ కనిపించనట్టుగా ఉన్న డ్రోన్లు రానున్న రోజుల్లో విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నాయి. నిరుద్యోగ సమస్యను మరింత పెంచబోతున్నాయి. పిడబ్ల్యుసి అనే కన్సల్టింగ్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2020నాటికి 12,700 కోట్ల డాలర్ల విలువైన పనుల్ని వాటంతట అవే చక్కబెట్టేస్తాయట. అంటే ఆ మేరకు ఉద్యోగావకాశాలు అడుగంటిపోతాయట.
ప్రస్తుతానికి డ్రోన్లకు 200 డాలర్ల విలువైన మార్కెట్ ఉంది. భవిష్యత్తులో ఇది ఇంతై వటుడింతై అన్నచందంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మానవ జీవితంలో డ్రోన్లు కూడా భాగమై పోతున్నాయి. వౌలిక సదుపాయాల రంగంలో ఇప్పటికే డ్రోన్లు ప్రవేశించాయి. రానున్న రోజుల్లో వీటి సేవలు మరింత విస్తృతం కానున్నాయి. విమానాశ్రయాల్లో టార్మేక్ బీటలు వారితే పసిగట్టడం, వంతెనలు, ఇళ్ల పగుళ్లను పసిగట్టి, వాటిని పూడ్చటం వంటి పనులన్నీ డ్రోనే్ల చేయబోతున్నాయి. నిర్మాణ సంస్థలు ఏకంగా డ్రోన్లకే త్రీడి ప్రింటర్లను అమర్చి డామేజ్ అయిన భాగాలను తొలగించడం, కొత్తవాటిని అమర్చడం వంటి పనుల్ని చేపడతాయట.
రవాణా రంగం విషయానికొస్తే, ఆహార పదార్ధాల సరఫరాను మొత్తం డ్రోనే్ల చేయబోతున్నాయి. ఉదాహరణకు హోటళ్లనుంచి లేదా మాల్స్ నుంచి ఆర్డర్‌పై ఆహార పదార్ధాలను లేదా సరకులను ఇంటికి సరఫరా చేసేవి డ్రోనే్ల. ఇప్పటికే అమెజాన్ వంటి ఇ కామర్స్ సంస్థలు తమ సరకుల రవాణాకు డ్రోన్లను రంగంలోకి దించాయి కూడా. అలాగే గాలిలో ఎగిరే పక్షులకు హాని కలగకుండా, కరెంటు తీగలు, టెలిఫోన్ తీగలకు తగలకుండా డ్రోన్లను ఎలా ఉపయోగించాలనే విషయమై గూగుల్ సంస్థ పరిశోధనలు చేస్తోంది.
వ్యవసాయ రంగంలోనూ డ్రోన్లు పోషించబోయే పాత్ర తక్కువేమీ కాదట. పంటలకు పురుగు మందు చల్లడం, ఎరువులు వేయడం వంటి పనులను డ్రోనే్ల చేయబోతున్నాయి. పంటలకు పట్టే చీడపీడలపై ఇవే నివేదికలు ఇవ్వబోతున్నాయి.
అయితే డ్రోన్ల ఉపయోగంపై అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనే స్పష్టమైన విధివిధానాలకు రూపకల్పన జరగలేదు. ఇక ఇండియాలో ఈ విషయమై ప్రభుత్వాల దృష్టి ఇంకా పడలేదనే చెప్పాలి. అమెరికాలో డ్రోన్లను ఉపయోగించేవారు యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో విధిగా నమోదు చేసుకోవాలనే నిబంధన త్వరలో రూపుదాల్చబోతోంది. భవిష్యత్తులో డ్రోన్లు పో షించబోయే పాత్రపై ఓవైపు ఆసక్తికరంగానూ, మరోవైపు ఆందోళనకరంగానూ ఉంది. అసాధ్యమైన పనుల్ని సుసాధ్యం చేయడం ఆసక్తికరం. అయితే కోట్ల సంఖ్యలో ఉద్యోగాలకు ఎసరు పెట్టడం మాత్రం ఆందోళనకరమే. అలాగే విమానాశ్రయాలు, రక్షణ సంస్థలు వంటి ప్రాంతాల్లో డ్రోన్ల వాడకం ఆందోళనకరమే. *