యువ

బ్రేవో డెర్బీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెర్బీ అనే కుక్కపిల్ల చాలామందికి గుర్తుండే ఉంటుంది. ముందు కాళ్లు బలహీనంగా ఉండటంతో ఏడాదిన్నర కిందట డెర్బీకి త్రీడీ ప్రింటింగ్ సాయంతో రూపొందించిన చిన్న సైజు కాలిపర్స్‌ను అమర్చిన సంగతి అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే డెర్బీ పెరిగి పెద్దది కావడంతో ఆ కాలిపర్స్ సరిపోవడం లేదు. దీంతో న్యూ హాంప్‌షైర్‌లోని పీస్ అండ్ పాస్ అనే కుక్కల సంరక్షణ కేంద్రం ముందుకు వచ్చి డెర్బీకోసం కొత్త రకం కాలిపర్స్‌ను తయారు చేసి అమర్చారు. వీటి సాయంతో ఇతర కుక్కల్లా డెర్బీ కూడా పరుగులు పెడుతూ, చూసేవారికి ఆశ్చర్యం గొలుపుతోందట. మీరూ చూడండి ఫోటోలో!