యువ

ఆమెకామే ప్రత్యామ్నాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీనా దబీ...
ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరిది.
ఏళ్ల తరబడి తపస్సు చేసినవారినే వరించని
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను మొట్టమొదటి అటెంప్ట్‌లోనే సాధించిందామె.
డిగ్రీలో కాలేజ్ టాపర్
యూనివర్శిటీ గోల్డ్‌మెడలిస్ట్
బెస్ట్ ఆల్ రౌండ్ స్టూడెంట్ అవార్డ్ విజేత
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ విజేత
యుపిఎస్‌సి ఎగ్జామ్‌లో దేశంలోనే టాపర్
ఒక్క మాటలో చెప్పాలంటే టీనా...చదువుల తల్లి!
ఇవన్నీ సాధించడానికి వెనుక ఓర్పు, హార్డ్‌వర్క్, కార్యదీక్ష, పట్టుదల కారణమంటుంది. అంతకుమించి తనకోసం అన్నీ వదులుకున్న త్యాగమూ ర్తి అమ్మ ఉందంటుంది.
టీనాది ఢిల్లీ. పూర్వీకులది నాగపూర్ సమీపంలోని పుల్గాం. తండ్రి జస్వంత్ సింగ్, తల్లి హిమాలీ. ఇద్దరూ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అధికారులే. వారే కాదు...చుట్టాల్లోనూ అంతా ఇంజనీర్లే. చిన్నప్పటినుంచీ టీనా చదువుల్లో ముందుండేది. దాంతో టీనాను ఇంజనీరింగ్ కాకుండా ఐఎఎస్ చదివించాలని హిమాలీ భావించేవారు. అందుకు తగ్గట్టే టీనా చదువుల్లో ఎంతో ప్రతిభ కనబరిచేది. ఒక దశలో చదువులో మునిగిపోయే కుమార్తెకోసం తోడూ నీడగా ఉండేందుకు తల్లి హిమాలీ తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
భోపాల్‌లో పుట్టిన టీనా ఏడో తరగతి వరకూ అక్కడే చదివింది. 2005లో వారి కుటుంబం ఢిల్లీకి మారింది. అక్కడ జీసస్ అండ్ మేరీ కానె్వంట్‌లో ఇంటర్ వరకూ చదివింది. ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్న టీనా, రెండు నెలల్లోనే హ్యూమానిటీస్ వైపు మళ్లింది. ఆమె చర్యను అంతా తప్పుపట్టినా ఐఎఎస్‌వైపు తనను నడిపించడంలో అప్పట్లో తాను తీసుకున్న నిర్ణయం కీలకమంటుందామె. హ్యూమానిటీస్ చదవడంవల్లనే తాను పరిపూర్ణమైన మహిళగా మారగలిగానంటుంది. లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చేసిన టీనా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌ను గెలుచుకుంది.
అమ్మే ఆదర్శం
డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఐఎఎస్‌కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టిన టీనా, రోజుకు ఎనిమిదినుంచి పది గంటలు చదివానంటుంది. ప్రణాళికాబద్ధంగా చదవడమే తన విజయానికి కారణమని చెప్పే టీనా, తనకు తానే వీక్లీ టార్గెట్స్ పెట్టుకునేదానినని చెబుతుంది. ‘వీటన్నింటికీ మించి నా కోసం అన్నీ వదులుకున్న అమ్మ నా విజయానికి కారణం. బిడ్డలకోసం ఇంతగా త్యాగం చేసే తల్లుల్లో మా అమ్మదే అగ్రస్థానమేమో! ‘నా కలలు సాకారం చేసేందుకు అమ్మ అహరహం శ్రమించింది. ఉద్యోగం వదులుకోవడమే కాదు... అన్నింటా నాకు తోడూ నీడై నిలిచింది. ఆమె నా రోల్ మోడల్’ అంటూ టీనా ఉద్వేగభరితంగా చెబుతుంది.
దళితుల విజయమిది!
ఐఎఎస్ టాపర్‌గా ఓ దళిత మహిళ నిలవడం ఇదే మొదటిసారి. అంబేద్కర్ జీవిత విధానమంటే టీనా ఇంట్లో అందరికీ ఆదర్శం. టీనాపై కూడా అంబేద్కర్ ప్రభావమెంతో ఉంది. మహిళా సాధికారత అత్యవసరమనే టీనా, హర్యానా కేడర్‌ను ఎంచుకోవడానికీ కారణముంది. హర్యానాలో మహిళా ఉద్యోగుల సంఖ్య బాగా తక్కువ. స్ర్తి పురుష సమానత్వ సాధనలో ఆ రాష్ట్రం వెనుకబడి ఉన్నందునే తాను హర్యానా కేడర్‌ను ఎంచుకున్నానని టీనా చెబుతుంది.
ఐఎఎస్ సాధనలో అహరహం శ్రమించే వారికి మీరిచ్చే సందేశమేమిటని ప్రశ్నిస్తే కృషి...పట్టుదల... కష్టించే మనస్తత్వం అంటుంది. టీనా విజయంపై ఆమె తల్లిని విలేఖరులు ప్రశ్నించినప్పుడు ఆమె తన కుమార్తె గురించి చెప్పిన మాట...
దళూళ నిఒ యో ఆళూశ్ఘఆజ్పళ (ని)! *