యువ

హైఫై కార్లు...మీరూ నడపొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంపౌండ్‌లోకి సర్రున దూసుకొచ్చింది ఆడి ఆర్‌ఎస్5 కారు. అందులోంచి స్టయిల్‌గా దిగాడు హీరో. అది విలన్ డెన్. నేరుగా లోపలికి వెళ్లాడు. తన ఎదురుగా వచ్చి నిలబడిన హీరోను చూసి విలన్ ముందు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత భయపడ్డాడు. హీరో...అదేం గమనించకుండా
విలన్‌ను రఫ్పాడించేసి మళ్లీ అంతే స్టయిల్‌గా
ఆడి కారులో వెళ్లిపోయాడు. థియేటర్‌లో సినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడు హీరో స్టయిల్‌కి, అతను ఎక్కి వచ్చిన కారుకి ఫిదా అయిపోయాడు. తనూ అలాంటి కారులో విహారం చేస్తున్నట్టు కలల్లో తేలిపోయాడు.
ఇలాంటి కలలు కనని కుర్రాళ్లుంటారా? అధునాతనమైన కార్లు, బైకులంటే యువత పడిచచ్చే కాలమిది. ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లలోనూ, హార్లీ డేవిడ్‌సన్, డుకాటీ లాంటి బైక్‌లపైనా చక్కర్లు కొట్టాలని ఎవరు మాత్రం అనుకోరు. కానీ, డబ్బుల దగ్గరే అసలు సమస్య. హైఫై కార్లు, బైకులు కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. హార్లీ డేవిడ్‌సన్ బైకులు ఐదు లక్షలకు తక్కువ లేవు. మరి, డబ్బున్నవాళ్ల సంగతి అలా ఉంచితే మధ్య తరగతి యువత మాటేవిటి?
హైదరాబాద్ యువతకి మాత్రం ఇలాంటి బెంగ ఇక అక్కర్లేదు. ఎందుకంటారా? ఎంత ఖరీదైన కార్లు, బైకులయినా సరే అద్దెకి ఇచ్చే ‘డ్రివెన్ కేఫ్’ ఈ మధ్యనే వెలిసింది. కుర్రకారు మనస్తత్వాన్ని అధ్యయనం చేసిన ఇద్దరు హైదరాబాదీయుల మనసులోంచి రూపుదిద్దుకున్న ఆలోచన ఇది. అశ్విన్ జైన్ (41), అహ్మద్ తాహెర్ (27) మంచి ఫ్రెండ్స్. ఎవరి వ్యాపారాలు వారికున్నాయి. ఇద్దరినీ కలిపే ఓ కామన్ త్రెడ్- కార్లూ, బైకులూ. ఇవంటే ఇద్దరికీ ప్రాణం. అందులోనూ అశ్విన్ జైన్ పాతికేళ్లుగా కార్ రెంటల్ బిజినెస్ చేస్తున్నారు. యువత అభిరుచులకు అనుగుణంగా ‘డ్రివెన్ కేఫ్’ పెట్టాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. రెండు నెలల క్రితం ఈ కేఫ్ ప్రారంభమైంది. పోషె 911, కాయిరా 4ఎస్, వాల్వో ఎస్ 60, ఆడి ఆర్‌ఎస్ 5, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, బిఎండబ్ల్యు 7 వంటి కార్లు డ్రివెన్ కేఫ్‌లో అందుబాట్లో ఉన్నాయి. అంతేకాదు....డుకాటీ, ట్రయంఫ్, హార్లీ డేవిడ్‌సన్, ఇండియన్, బెనెల్లీ, కవసాకి, కెటిఎమ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి హై ఎండ్ బైకులూ ఉన్నాయి. ఇలా డ్రివెన్ కేఫ్‌లో 150 కార్లు, 50 బైకులూ, ఏడు సైకిళ్లూ ఉన్నాయి.
అద్దెకు కారు లేదా బైక్ కావాలనుకునేవారు నేరుగా డ్రివెన్ కేఫ్‌కు వెళ్లొచ్చు. అందులో ఓ కాఫీ షాప్ కూడా ఉంది. కావలసిన కారుకు ఆర్డరిచ్చి కాఫీ తాగేలోపు కారు రెడీ అవుతుంది.
డ్రివెన్ కేఫ్‌లో గంటల ప్రాతిపదికన, కిలోమీటర్ల లెక్కన అద్దె వసూలు చేస్తారు. కార్లకయితే 800నుంచి 4000 రూపాయల వరకూ, బైక్‌లకయితే 300నుంచి 1200 రూపాయల వరకూ అద్దె ఉంటుందన్నారు జైన్, తాహెర్ ద్వయం.
ఇంత ఖరీదైన కార్లు, బైక్‌లను అద్దెకివ్వడం రిస్క్‌తో కూడుకున్న పనే. ఆ మధ్య హైదరాబాద్‌లో హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొనేందుకు షోరూమ్‌కి వచ్చి ట్రయల్ రన్ పేరిట బైక్‌నే తస్కరించాడో ఘనుడు. ఇదే విషయాన్ని జైన్ దృష్టికి తీసుకొస్తే, తమకు ఆ భయం లేదన్నారు. ఎందుకంటే....తమ వాహనాలన్నింటికీ జిపిఎస్ ట్రాకర్లు అమర్చామన్నారు. క్లయింట్ ఎక్కడకు వెడుతున్నదీ ఓ కంట కనిపెడుతూనే ఉంటామని చెప్పారు. అలాగే క్లయింట్ ఓవర్ స్పీడ్‌గా వెడుతుంటే తగిన హెచ్చరికలు చేస్తామన్నారు. హైదరాబాద్‌తోపాటు వైజాగ్, విజయవాడల్లోనూ డ్రివెన్ కేఫ్ సేవలు అందిస్తోందనీ, త్వరలో తమ వ్యాపారాన్ని చెన్నై, బెంగళూరు, గోవా, న్యూఢిల్లీ వంటి నగరాలకు విస్తరించాలన్నది తమ ఆలోచన అని జైన్, తాహెర్ చెప్పారు.

chitram మెర్సిడెస్ బెంజ్