యువ

‘లోకల్’ యాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిలో రైలు దిగి సచిన్ టెకె ఎవరని అడిగితే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. లేదా ముంబయి రైలులో ప్రయాణిస్తూm-indicator యాప్ గురించి అడిగినా తోటి ప్రయాణికులు ఠక్కున దాని గురించి చెబుతారు. ముంబయికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సచిన్ టెకె కనిపెట్టిన ఎం-ఇండికేటర్ యాప్ ఇప్పుడు అక్కడ లోకల్ ట్రెయిన్లలో ప్రయాణించే కోట్లాదిమందికి ఆశాదీపంలా మారింది.
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో యాప్స్ రూపొందించే పని చేసే సచిన్ రోజూ లోకల్ ట్రెయిన్ లో రెండున్నర గంటలపాటు ప్రయాణించి ఆ ఫీసుకు చేరేవాడు. వచ్చేటప్పుడూ అదే పద్ధతి. ట్రెయిన్లలో రద్దీని తట్టుకోలేక, అనేక సందర్భాల్లో రాత్రి పదింటివరకూ ఆఫీసులోనే కాలక్షేపం చేసి, ఆ తర్వాత బయల్దేరి ఇంటికొచ్చేవాడు. ఒక దశలో ఈ పద్ధతిని మార్చాలని కంకణం కట్టుకున్నాడు. లోకల్ రైళ్ల టైమ్ టేబుల్స్ తెలియచెప్పే యాప్ రూపకల్పనకు నడుం బిగించాడు. ముంబయిలో తిరిగే 232 లోకల్ రైళ్లు, అవి రోజూ తిరిగే మూడు వేలకు పైగా ట్రిప్పుల గురించి సమస్త సమాచారం, కచ్చితమైన టైమింగ్స్‌తో సహా ఇచ్చేm-indicatorయాప్‌ను తయారు చేశాడు. అయితే ఇదంత సులభం కాలేదంటాడు సచిన్. యాప్‌లో మొత్తం 84వేల టైమ్‌టైబుల్స్‌ను ఎంట్రీ చేయాల్సి వచ్చింది. అలాగే ఏ రైలు ఎప్పుడు ఏ స్టేషన్‌కు వస్తుందో తెలియచెప్పడం మరో సవాల్‌గా పరిణమించింది. ప్లాట్‌ఫామ్‌పై డిస్‌ప్లే అయ్యే టైమింగ్స్‌లో కూడా కచ్చితత్వం లేకపోవడం గమనించిన సచిన్, కొందరు ఉద్యోగులను నియమించుకుని, సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాడు. అలా 2010లో ఎం- ఇండికేటర్ వాడుకలోకి వచ్చింది. అయితే ఈ యాప్ గురించి తెలియచెప్పడం కూడా తలకు మించిన భారమైందంటాడు సచిన్. కేవలం వౌత్ పబ్లిసిటీపైనే ఆధారపడి పదిమందికీ తెలిసేలా చేయాలనుకున్నాడు. దానికోసం ప్రతి రోజూ తాను రైలులో వెళ్లేటప్పుడు అందరూ చూసేలా స్మార్ట్ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసేవాడు. దాంతో ఇతర ప్రయాణికులు ఆసక్తి కనబరిచేవారు. వారికి దాని గురించి వివరించి, డౌన్‌లోడ్ చేసుకోమని సూచించేవాడు. ఇలా ఒకరినుంచి ఒకరికి దావానలంలా ఈ యాప్ గురించి పాకిపోయింది. ఎం-ఇండికేటర్ యాప్‌కు ఇప్పుడు అక్షరాలా కోటిమంది వినియోగదారులున్నారంటే అతిశయోక్తి కాదు. అలాగే సచిన్‌కు ఏటా పది లక్షల రూపాయల ఆదా యం తెచ్చి పెడుతోందీ యాప్. యాప్ జనంలోకి బాగా వెళ్లాక, ఉద్యోగానికి రిజైన్ చేసిన సచిన్, ఇప్పుడు పూర్తి సమయాన్ని ఎం-ఇండికేటర్‌కే కేటాయిస్తున్నాడు. ఇప్పుడు ట్రావెల్ యాప్స్‌లో ఇండియాలోనే నెంబర్ టూ యాప్‌గా ఎం-ఇండికేటర్ స్థానం సంపాదించింది. ఎం- ఇండికేటర్‌ను ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి లోకల్ రైళ్లు ఎక్కువగా తిరిగే నగరాల్లోనూ ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు సచిన్.
*