యువ

జెబ్రోనిక్స్‌నుంచి జెబ్ స్పీకర్ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ ఐటి పెరిఫరెల్స్ సంస్థ జెబ్రోనిక్స్ సరికొత్త జెబ్ స్టేషన్ 2తో మార్కెట్లోకి వచ్చింది. చూడటానికి చిన్నగానే ఉన్నా ధ్వని మాత్రం సూపర్బ్. స్పీకర్‌కు బిల్టిన్ క్లాక్, డ్యూయల్ అలారమ్ ఉంటాయి. స్పీకర్ స్విచాఫ్ చేసినా, ఇవి మాత్రం పనిచేస్తూనే ఉంటాయి. అలారమ్‌లను పూర్తిగా స్విచాఫ్ చేయొచ్చు లేదా స్నూజ్‌లో పెట్టొచ్చు. స్పీకర్‌కు శక్తిమంతమైన 1200ఎంఎహెచ్ బ్యాటరీ ఉండటంతో కావలసినంతసేపు పాటలు వినొచ్చు. దీనిని బండిల్ ఎడాప్టర్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. యుఎస్‌బి పెన్‌డ్రైవ్ లేదా ఎస్‌డి/ఎంఎంసి కార్డుని స్పీకర్‌కు కనెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. బ్లూటూత్ 3 సపోర్ట్‌తో వైర్‌లెస్‌గా ఆడియోని స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇందులో బిల్టిన్ ఎఫ్‌ఎమ్ రేడియో కూడా ఉండటం విశేషం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అత్యుత్తమ బెడ్‌సైడ్ స్పీకర్‌గా జెబ్‌స్పీకర్ 2 ఉపయోగపడుతుందని జెబ్రోనిక్స్ హామీ ఇస్తోంది. దీని ధర రూ.4900. *