యువ

దురలవాట్లను మాన్పించే బ్రేస్‌లెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమందికి గోళ్లు కొరకడం అలవాటు. ఇంకొందరికి చీటికీ మాటికీ జుత్తు సవరించుకోవడం అలవాటు. మరికొందరికి అదే పనిగా నోట్లో వేలు పెట్టుకోవడం అలవాటు. ఇవన్నీ ఓ విధంగా దురలవాట్లే. చిన్నతనంలో చేసుకున్న అలవాటును పెద్దయినా మానలేకపోవడంతో చూసేవారికి ఈ అలవాటు ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీనిని అరికట్టేందుకు మార్కెట్లోకి ఓ బ్రేస్‌లెట్ వచ్చింది. దీని పేరు లివ్ (జని). దీనిని ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేసే యాప్‌తో అనుసంధానిస్తారు. ఈ బ్రేస్‌లెట్‌ను చేతికి పెట్టుకుంటే...ఏమరుపాటులో దురలవాటును కొనసాగించబోయినా వెంటనే వైబ్రేషన్స్ ద్వారా హెచ్చరిస్తుంది. లివ్‌లో ఉండే సెన్సర్లు చేతి కదలికలను పసిగట్టి హెచ్చరికలు పంపుతాయన్నమాట. దీనిని ఇండియాకే చెందిన సమీర్ కుమార్, అనీలా ఇద్నానీ కుమార్ తయారు చేశారు. *