యువ

క్రేజీ టూ వీలర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్లు ఎన్ని ఉన్నా మోటార్ సైకిల్‌పై తిరిగితే ఆ ఎంజాయ్‌మెంటే వేరు. అందుకు తగ్గట్టుగానే రకరకాల మోటార్ సైకిళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. యువత అభిరుచులకు అనుగుణంగా రోజుకో కొత్త మోటార్ సైకిల్ వెలుగుచూస్తోంది. మోటార్ సైకిల్ అంటే ఇలాగే ఉండాలి అనే కానె్సప్ట్ పోయి, నేలబారు మోటార్ సైకిళ్లు, నిట్టనిలువుగా ఉండేవి, మూడు చక్రాల మోటార్ సైకిళ్లు ఇలా...ఆశ్చర్యంగొలిపేలా రకరకాల టూ వీలర్స్ వస్తున్నాయి. అలాంటి కొన్ని టూ వీలర్స్ గురించి ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం.
ఇ-కార్ట్
గోకార్టింగ్ రేసుల్లో సర్రున దూసుకుపోయే బుల్లి బుల్లి కార్లు భలే ముచ్చటగా ఉంటాయి కదూ! అలాంటిదే ఓ ఎలక్ట్రిక్ కారును ప్రఖ్యాత బాష్ కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తోంది. దీని పేరు ఇ-కార్ట్. ఇంజన్ ఆన్ చేసిన ఐదు సెకన్ల లోపు వంద కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోవడం దీని ప్రత్యేకత. ఇటీవల జరిగిన బెర్లిన్ ఫార్ములా ఇ- ఈవెంట్‌లో ప్రదర్శితమైన ఈ కారు వచ్చే ఏడాది మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
నేలబారు ‘మ్యాడ్’
ఇటలీలో ఓ బుల్లి మోటార్ సైకిల్ ఇప్పుడు తాజా సంచలనంగా మారింది. దాని పేరు వెలోసిఫెరో మ్యాడ్. నేలబారుగా ఉండే ఈ మోటార్ సైకిల్‌ను ప్రఖ్యాత ఇటలీ డిజైనర్ టర్టారినీ రూపొందించాడు. దీనిని మోటార్ సైకిళ్లలో ‘ఎస్‌యువి’గా ఇటలీలో అభివర్ణిస్తున్నారు. మోటార్ సైకిల్ నేలబారుగా ఉన్నా, సీటు, హ్యాండిల్ బార్ మాత్రం నిట్టనిలువుగా ఉంటాయి. కావాలంటే ఈ హ్యాండిల్ బార్‌ను ఫోల్డ్ చేసుకోవచ్చు. సీటునూ తీసెయొచ్చు. ‘మ్యాడ్’ ఎలక్ట్రిక్ స్కూటరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంటకు 19-25 మైళ్ల వేగంతో ప్రయాణించే మాడ్ ధర 1,115 డాలర్లు.
మూడు చక్రాల ట్రైసిటీ
మోటార్ సైకిళ్ల తయారీలో పేరొందిన యమహా కంపెనీ తాజా ఆవిష్కరణ ట్రైసిటీ 125 జపాన్‌లో పెద్ద సంచలనంగా మారింది. అమెరికాలోకి ఇంకా ప్రవేశించకపోయినా, యురోపియన్ దేశాల్లో దీని హవా బాగానే ఉంది. సాధారణంగా మూడు చక్రాల స్కూటర్ అంటే ముందో చక్రం, వెనకాల రెండు చక్రాలు ఉండటం పరిపాటి. కానీ ట్రైసిటీ 125కి ముందే రెండు చక్రాలు ఉంటాయి. ట్రైసిటీ 125 పనితీరు బాగుండటంతో ఇప్పుడు దీనికే మరికొన్ని హంగులు అద్ది, ట్రైసిటీ 155 పేరిట మరో బైక్‌ను యమహా తీసుకొస్తోంది. ఫోటోలో చూస్తున్నారుగా ఈ మూడు చక్రాల ముచ్చటైన ట్రైసిటీని.
*

chitram ఇంజన్ ఆన్ చేసిన ఐదు సెకన్ల లోపు వంద కిలోమీటర్ల వేగాన్ని
పుంజుకోవడం ఇ-కార్ట్ ప్రత్యేకత.
* మూడు చక్రాల ట్రైసిటీ