యువ

ఉష్ణోగ్రత చూపించే కాఫీ మగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కో సారి మీరు చేస్తున్న పని ఆపేసి కాఫీ బ్రేక్ తీసుకోవలసి వస్తుంది. ఆ కొద్ది సమయం లభించే విశ్రాంతి మీ మెదడు తిరిగి శక్తిని పుంజుకుని మీరు చేస్తున్న పనిని మరింత ఉత్సాహంగా చేసేలా చేస్తుంది. అఫ్‌కోర్స్.. కాఫీలో ఉండే కెఫీన్ కూడా దీనికి తోడవుతుందనుకోండి! అయితే మీరు కాఫీ లేదా టీ తాగేటప్పుడు దాన్ని అస్వాదిస్తూ తాగాలని అనుకోవడంలో తప్పు లేదు. కప్పులోని పానీయం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అది మీరు ఇష్టపడి తాగేంత వేడిగా ఉండాలి కూడా. అప్పుడే మీరు దాన్ని మరింత ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ కాఫీ కప్ మీ మగ్‌లోని ద్రవ పదార్థం ఎంత ఉష్ణోగ్రతలో ఉందో బైటికి చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఎప్పుడు దాన్ని తాగితే బాగా ఎంజాయ్ చేయగలుగుతారో తెలుస్తుంది. ఈ కప్పుకు ఒక వైపున ఆరు ఇండికేటర్ లైట్లు ఉంటాయి. అవి మీ కప్పులోని ద్రవం ఎంత టెంపరేచర్‌లో ఉందో(్ఫరన్‌హీట్ లేదా సెంటీగ్రేడ్ రెండింటిలో) చూపిస్తుంది. ఇండికేటర్ లైట్లకు తోడు ఓక్కో ఉష్ణోగ్రత పక్కనే బెవరేజ్ టైప్ చిత్రాలు కూడా ఉంటాయి. మీరు సేవించే ద్రవపదార్థం కాఫీ, టీ లేదా మరేదైనా కావచ్చు ఏది ఎప్పుడు ఎంత ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు సేవిస్తే బాగుంటుందో దానివల్ల తెలుస్తుంది. ఈ మగ్‌లోని స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లో 280 మిల్లీ లీటర్ల పానీయం పడుతుంది. అయితే అలా అని చెప్పి మగ్‌లోని ద్రవం వేడెక్కడం కోసం దాన్ని మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే స్టెయిన్‌లెన్ స్టీల్ కంటైనర్ వెలుపల ఉండే దాన్ని ఎబిఎస్ ప్లాస్టిక్‌తో చేసారు. ఇది పింగ్, బ్రౌన్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర దాదాపు 28 డాలర్లు.