యువ

మరిచిపోయిన వస్తువును వెతికిపెట్టే లాస్ట్ ఐటం ప్రివెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫీసు టైమ్ అయిపోతోందనో, సిటీ బస్సు దొరకదేమోననే తొందరలోనో హడావుడిగా బయలుదేరేటప్పుడు ఒక్కోసారి మనం ఎదో ఒకటి మరిచి పోతూ ఉంటాం. లేదా ఒక వస్తువును ఉంచాల్సిన చోట కాకుండా వేరే చోట ఉంచేసి ఎక్కడ ఉంచామో గుర్తుకు రాక భార్య మీదనో లేదా ఇంట్లో అందరిమీదనో మండిపడుతూ ఉంటాం. అది ఓ చిన్న కారు కీ కావచ్చు లేదా కళ్ల జోడో, మరేదోవస్తువు కావచ్చు. ఇలాంటి చిన్న పాటి గృహచ్ఛిద్రాలు చినికి చినికి గాలివానలాగా మారి పెద్ద గొడవలకు కూడా దారి తీయవచ్చు. ప్రతి సంసారంలోను ఇలాంటివి మామూలే. ఇలాంటి సమస్యలన్నిటికీ సరయిన పరిష్కారమే ఈ ‘లాస్ట్ ఐటం ప్రివెంటర్’. ఇది ఏమి చేస్తుందోదీని పేరులోనే ఉంది. ఇది ఓ చిన్న పాటి లైటుతో కూడిన పరికరం. దీన్ని మీ వ్యక్తిగత వస్తువులు దేనికైనా అటాచ్ చేసుకోవచ్చు. దానివల్ల అది పోకుండా చూసుకోవచ్చు. మీరు వెతకాల్సిన వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికి వీలుగా ఆ వస్తువు బొమ్మను చూపించడమే కాకుండా లైటు వెలిగేలా చేసే ఒక ఉచిత స్మార్ట్ఫోన్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఒక వేళ మీరు ఏదయినా వస్తువు మరిచిపోవడమో, కనిపించలేదో జరిగిందనుకుందాం. అప్పుడు మీరు ఆ వస్తువుకు దగ్గరగా ఉన్నారో లేక దూరంగా ఉన్నారో ఈ పరికరం తెలియజేస్తుంది. ఒక వస్తువుకు మీరు వంద అడుగుల దూరంలో ఉండగా దాన్ని గుర్తించే విధంగా ఈ పరిరికం బల్బులోని బజర్ మోగేలా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఆ వస్తువు ఏ దిండుకిందో లేదా షర్టు, ప్యాంట్ జేబులోనో, బీరువాలోపలో ఉన్నా సరే అది ఇట్టే పసికట్టి చూపిస్తుంది. అలాగే రెస్టారెంట్‌లోనో, పబ్బులోనో పర్సు, కారు కీస్ లాంటివి మరిచి పోయినా అది గుర్తు చేస్తుంది. సిఆర్ 2032 బ్యాటరీతో ఇది పని చేస్తుంది. ప్రతి అవసరానికి ఇలాంటి మూడు రకాల పరికరాలు ఉంటాయి. దీని ఖరీదు కూడా పెద్ద ఎక్కువేమీ కాదు. 59.95 డాలర్లు మాత్రమే. *