యువ

యంగ్ లీడర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువతకు ఈ అవార్డ్ ప్రత్యేకమైనదనే చెప్పాలి.
సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేసిన, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కృషి చేసిన యువతరం ప్రతినిధులకిచ్చే ఈ అవార్డుకోసం 53 కామన్‌వెల్త్ దేశాలకు చెందిన యువతీయువకులు పోటీ పడ్డారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు ఇద్దరినే వరించింది. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన నేహా స్వెయిన్. ఇటీవలే ఆమె స్వయంగా క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో నేహాను ఆంధ్రభూమి పలకరించింది. నేహా మూడేళ్ల కిందట స్నేహితురాలు మోనిషా వేమవరపు, హేమ ఖత్రీలతో కలసి ‘రుబారూ’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మూడేళ్లలో పాతబస్తీ మొదలు హై టెక్ సిటీ వరకూ అనేక పాఠశాలలను వారు సందర్శించారు. పిల్లలతో మమేకమై, వారికి మార్గదర్శకత్వం ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. అవసరమైన సందర్భాల్లో వారికి చేయూతనూ అందించారు. సమాజానికి ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా నేహా క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. అవార్డు తీసుకునేందుకు బ్రిటిష్ ప్రధానమంత్రి ఆఫీస్‌కు వెళ్లడం, అక్కడ ఎందరో ప్రముఖులను కలుసుకోవడం మరచిపోలేని సంఘటన అని నేహా అన్నారు. క్వీన్ ఎలిజబెత్ తాను ఏం చేస్తున్నానో, ప్రజలతో ఎలా మమేకమవుతున్నానో స్వయంగా అడిగి తెలుసుకున్నారని, తాను నిర్వహిస్తున్న ‘రుబారూ’ గురించి చెప్పగా, ఆమె ఎంతో ప్రశంసించారని నేహా చెప్పారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి క్వీన్ ఎలిజబెత్‌తోపాటు ప్రిన్స్ హ్యారీ, ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్, క్రికెటర్ కుమార్ సంగక్కర వంటి వారు హాజరయ్యారని, వివిధ దేశాలనుంచి హై కమిషనర్లు కూడా వచ్చారని నేహా వివరించారు. అవార్డుతోపాటు యువతకు చేయూతనందించేందుకు ఉపయోగపడే ఓ కోర్సును ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ఏడాదికాలం పాటు నేహాకు అందిస్తుంది. ఆన్‌లైన్‌లో అందించే ఈ కోర్సుకు ఓ మెంటర్ నేహాకు సాయపడతారు.

చిత్రం.. మోనీషా, నేహా, హేమ