యువ

జెంటిల్‌మేన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూత్నమైన ఆలోచనలు మీ సొత్తయితే, వాటికి పదును పెట్టి, ఫండ్స్ సేకరించి, మీకో దారి చూపించే వెబ్‌సైట్ ఇది!
ఐడియాలు వెల్లువెత్తే కుర్రకారు ప్రతిభకు పట్టం గట్టి, వారి పాటవాన్ని వెలుగులోకి తెచ్చి, చేరదీసి చేయూతనిచ్చేందుకు వెలిసిన వెబ్‌సైట్ ఇది!
దీనిని నడుపుతున్నది అచ్చంగా తెలుగువాడు. పేరు రంగనాథ్ తోట. హైదరాబాద్‌కు చెందిన రంగనాథ్ రెండు దశాబ్దాలపాటు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. వృత్తిలో భాగంగా దేశంలోని అనేకచోట్ల పనిచేశారు. స్థిరపడ్డాక పదిమందికీ సాయం చేయాలన్నది ఆయన చిరకాల కోరిక. ఓ రోజు క్రౌడ్ ఫండింగ్ గురించి ఎవరో రంగనాథ్‌కు చెప్పారట. దాని గురించి ఆరా తీసి, యువతకు అది పనికొస్తుందని భావించి, ‘్ఫ్యయల్ ఎ డ్రీమ్ డాట్ కామ్’కు ప్రాణం పోశారు. అప్పటినుంచీ ఈ వెబ్‌సైట్ అనేకమందికి స్నేహహస్తం అందించి ఆదుకుంది.
‘ఎవరైనా క్రౌడ్ ఫండింగ్‌ను ఆశించి తమ ఐడియాలు మాకు పంపొచ్చు. వీటికి ఫండింగ్ చేసే బాధ్యతను మేం తలకెత్తుకుంటాం. ముందుకొచ్చిన వారిని నాలుగు కేటగిరీలుగా విభజిస్తాం. ఐడియాలు, ఛారిటీ, రికవరీలు, కారణాలు. ఏదైనా ఒక ఐడియా నచ్చి, క్రౌడ్ ఫండింగ్‌కు ముందుకొస్తే, మా బృందం... వారితో కలసి ఫండ్ రైజింగ్‌కు, మార్కెటింగ్‌కు వ్యూహాలు రూపొందిస్తుంది. అయితే డబ్బులిచ్చేవారికి కావలసింది పారదర్శకత. అందుకనే వచ్చిన డబ్బును ఏ రోజు ఎంత వచ్చింది తదితర వివరాలను వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ క్యాంపెయిన్ ఓనర్లకు నచ్చకపోతే వారు విరమించుకోవచ్చు’ అంటూ వివరించారు రంగనాథ్.సమాజంలో ఎందరో మంచి పనులు చేస్తుంటారు. కానీ నిధుల సేకరణ అనేది వారికి ఓ పెద్ద సమస్య. క్రౌడ్ ఫండింగ్ అలాంటి వారికి వరం. మంచి పనులు చేసే మంచివారికి తోడ్పాటు అందించడమే మా పని’ అని వినయంగా చెబుతారు రంగనాథ్. Fueladream.com ద్వారా రంగనాథ్ ఎన్నో అద్భుతాలు సాధించారు. వాటిలో మచ్చుకు కొన్ని.

చిత్రం.. రంగనాథ్ తోట