యువ

రైతుకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టల్రోని ఓ కరవు పీడిత ప్రాంతంలో రైతులు తమ పొలాలకు నీరు మళ్లించుకునేందుకు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా కాల్వ తవ్వకం చేపట్టారు. వారికి మూడు లక్షల రూపాయలు తక్కువ పడ్డాయి. ఈ విషయాన్ని ఫ్యుయల్ ఎ డ్రీమ్ వెబ్‌సైట్‌లో పెట్టారు. అంతే...అనుకున్నట్టుగా మూడు లక్షలూ సమకూరాయి. కాల్వ తవ్వకం పూర్తయింది.

చూపుతెచ్చింది!
హైదరాబాద్‌కు చెందిన ఓ కుర్రాడు ఓ స్వచ్ఛంద సంస్థతో కలసి ‘రీ-విజన్’ (్గళపజఒజ్యశ)పేరిట ఓ బృహత్కార్యాన్ని తలపెట్టాడు. అదేమిటంటే... అల్పాదాయ వర్గాల్లో కంటి చూపు మసకబారిన వందమంది మహిళలకు ఉచితంగా కాటరాక్ట్ ఆపరేషన్లు చేయించడం. ఇందుకోసం 2.2 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేసి, ఆ మేరకు నిధుల సేకరణ కోసం ఫ్యుయల్ ఎ డ్రీమ్‌ను ఆశ్రయించారు. అనుకున్నట్టుగానే డబ్బు సమకూరింది. ఆ కుర్రాడి లక్ష్యం నెరవేరింది.

పర్యావరణానికి చేయూత
కాలుష్యం కోరలు సాచి, పర్యావరణాన్ని కబళిస్తున్న ఈ రోజుల్లో కోయంబత్తూరుకు చెందిన ఓ సంస్థ వినూత్నమైన ఐడియాతో ఫ్యుయల్ ఎ డ్రీమ్ సాయం అర్థించింది. ఈ సంస్థ ‘స్పెరో’ పేరిట పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ సైకిల్‌ను రూపొందించింది. ఎవరైనా 30 వేల రూపాయలు విరాళమిస్తే, రిటైల్ ధరలో సగానికే ఈ సైకిల్‌ను ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. 30 లక్షలు సేకరించాలన్నది సంస్థ ఆశయం. వెబ్‌సైట్‌లో ఈ సైకిల్ గురించి తెలుసుకున్న వారు ఇప్పటివరకూ 9 లక్షల రూపాయలు సహాయం అందించారు.