యువ

అమ్మో... అమ్మాయేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనమ్ హషీమ్‌ను చూస్తే పక్కింటమ్మాయనే అనుకుంటాం. ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్న ఆనమ్ వయసు 21 ఏళ్లు. చలాకీగా, పరవళ్లు తొక్కే నదిలా ఉండే ఆనమ్‌ను చూస్తే ఎవరికైనా స్టంట్ రైడర్ అంటే నమ్మకం కలగదు. కానీ బైక్‌లపై మగాళ్లు చేసే ‘వీలీ’, ‘ఫ్లెమింగో’, ‘స్టాపీ’ వంటి స్టంట్లన్నీ సునాయాసంగా చేసేస్తుంది. ఇండియాలో మొదటి ఫిమేల్ స్టంట్ రైడర్ కూడా ఆమే. ఈ చలాకీ చిన్నది గత ఏడాది ఓ అరుదైన ఫీట్ చేసి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కింది. టివిఎస్ కంపెనీ వాళ్లు ఆ మధ్య ఆనమ్‌కు ఓ కాంట్రాక్ట్ ఇచ్చారు. అదేంటంటే... లడక్‌లో ఉన్న ఖర్దుంగా లా పాస్ శిఖరాన్ని బైక్‌పై అధిరోహించడం. అసలే అలాంటి ఫీట్లంటే ఇష్టమేమో...అడగ్గానే ఆనమ్ ఒప్పేసుకుంది. ఓ మంచి బైక్ ఇస్తారేమో, తడాఖా చూపిద్దామనుకుంది. అయితే ఆమెకు టీవిఎస్ వాళ్లు 110 సిసి స్కూటీని ఇచ్చారు. అయినా ఆనమ్ నిరుత్సాహపడలేదు. ఆ స్కూటీతోనే 18వేల అడుగుల ఎత్తున్న ఖర్దుంగా లా పాస్‌ను ఇట్టే అధిరోహించింది. తాజాగా మరో సాహసానికి ఆనమ్ పూనుకుంటోంది. వచ్చే నెలలో తనలాగే ఉత్సాహవంతులైన పదిమంది అమ్మాయిలతో కలసి మళ్లీ అదే ఖర్దూంగా శిఖరాన్ని అధిరోహించబోతోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆనమ్, విలేఖరులతో మాట్లాడుతూ రకరకాల బైక్‌లతోపాటు లేటెస్ట్ ఫ్యాషన్లనూ ఫాలో అవుతానని చెప్పింది. ఆనమ్ దగ్గర టీవిఎస్ స్కూటీ జెస్ట్ 100 సిసితోపాటు అపాచీ ఆర్‌టిఆర్ 180సిసి బైక్ కూడా ఉంది. ఖాళీ సమయాల్లో గిటార్ వాయిస్తూ ఎంజాయ్ చేస్తానని చెబుతున్న ఈ చిన్నది వచ్చే నెలలో తలపెట్టిన సాహసయాత్ర విజయవంతం కావాలని ‘యువ’ కోరుకుంటోంది.