యువ

ఆక్వా యోగా.. మంచిదేగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగాలో కొత్త కానె్సప్ట్ ఆక్వా యోగా!
నీళ్లలో యోగాసనాలు వేయడమనేది ఎప్పటినుంచో ఉన్నా, ఆక్వా యోగా పేరిట దేశ విదేశాల్లో ఇటీవలే ప్రాచుర్యం లభిస్తోంది. కండరాల పటుత్వానికి, శరీర ఉష్ణోగ్రతను సమతూకంలో ఉంచేందుకు, కేలరీలు కరిగించుకునేందుకు ఆక్వా యోగా దోహద పడుతుంది. అలాగే రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) తగ్గించడానికీ నీళ్లలో యోగాసనాలు ఉపయోగపడతాయి.
కాళ్లలో పటుత్వం లేనివారు కొన్ని రకాల ఆసనాలు వేయలేరు. అయితే నీళ్లలో శరీరం బరువు తగ్గిపోతుంది కాబట్టి అలాంటి వారికి ఆక్వా యోగా సత్ఫలితాలనిస్తుంది.
గాలికంటే నీరు 13 రెట్లు మందం గలది కాబట్టి శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడం, కేలరీలను తగ్గించుకోవడం ఆక్వా యోగాతో ఇట్టే సాధ్యమవుతుంది. ఆక్వా యోగా వల్ల గంటకు 700 కేలరీలు ఖర్చవుతాయన్నది నిపుణుల అంచనా. నీళ్లు కుషన్‌లా పనిచేస్తాయి కాబట్టి ఆసనాలు వేస్తూ గాయపడటమనేది ఉండదు.
నేలపై వేయలేని ఆసనాలు కూడా నీళ్లలో సులభంగా వేయగలగడం ఆక్వా యోగా ప్రత్యేకత.
బిగ్ టో (బొటనవేలు) భంగిమ
1 నీళ్లలో నిటారుగా నిలబడి, ఎడమ చేతిని నడుముకు సపోర్ట్‌గా పెట్టుకుని, శ్వాస తీసుకుని, కుడి కాలును నెమ్మదిగా లేపి, నీళ్ల ఉపరితలానికి తీసుకురావాలి. కాలి బొటనవేలిని కుడి చేత్తో పట్టుకుని కొంతసేపు నిలబడాలి. తిరిగి కాలిని యథాస్థానానికి తీసుకురావాలి. అలాగే ఎడమ కాలితో చేయాలి. ఈ ఆసనం వేస్తున్నప్పుడు మీరు నిలబడిన కాలిని, నడుమును వంచకుండా ఉండాలి. దీనిని బిగ్ టో భంగిమ అంటారు.
షుగర్‌కేన్
నీళ్లలో మీ బరువునంతా ఒక కాలిపైనే మోపి నిలబడాలి. మరో కాలును నెమ్మదిగా పైకి వంచాలి. పాదాన్ని చేత్తో పట్టుకుని, ఎంతసేపు ఉండగలిగితే అంత సేపుఉండాలి. దీన్ని ‘షుగర్‌కేన్ పోజ్’ అంటారు.
నార్త్‌స్టార్
నడుము పైవరకూ నీళ్లలో ఉండేలా చూసుకుని, కాళ్లను ఎడంగా ఉంచి, రెండు చేతులూ పైకెత్తి నమస్కరిస్తున్న భంగిమలో నిలబడాలి. అలా పలుసార్లు చేయాలి. ఈ ఆసనాన్ని ‘నార్త్‌స్టార్’ భంగిమ అంటారు.
వారియర్ పోజ్
నీళ్లలో నిలబడి, ఎడమ కాలిని వంచి, చేతులు ఇరువైపులకూ సాచి, దీర్ఘంగా శ్వాస పీల్చి, వదుల్తూ ఈ ఆసనం వేయాలి. ఇలా చేశాక, ఎడమ కాలిని వంచి, ఇదే తీరులో చేయాలి. దీనిని వారియర్ పోజ్ అంటారు.