యువ

పాటల పూదోటలో చివురించిన శ్రావ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పేరు శ్రావ్య. పేరుకు తగ్గట్టే శ్రావ్యంగా పాడుతుంది. ‘స రి గ మ ప’, ‘బ్లాక్’ వంటి పాటల ప్రోగ్రామ్‌లలో పాడి, అందరి దృష్టినీ ఆకట్టుకున్న శ్రావ్యది హైదరాబాద్. తాజాగా ‘పాడుతా తీయగా’కు ఎంపికైన శ్రావ్య జీవితంలో ఓ విషాదమూ ఉంది. ఆమె- అంధురాలు. పుట్టుకతోనే కంటి చూపు లేకుండా పుట్టినా, పాడటం ఆమె స్పెషాలిటీ అన్న విషయాన్ని ఆమె నాలుగో ఏటే తల్లిదండ్రులు గుర్తించారు. సంగీతం నేర్పించాలనుకున్నారు. కర్నాటక సంగీతం నేర్పించడం ప్రారంభించారు. అయితే- మొదట్లో తనకు సంగీతం నేర్చుకోవాలనే తపన అంతగా ఉండేది కాదంటుంది శ్రావ్య. లైట్ మ్యూజిక్‌లో రామాచారి వద్ద పాఠాలు నేర్చుకునేటప్పుడు కూడా అప్పుడప్పుడు కునికిపాట్లు పడేదట. అయితేనేం...ఆమె ‘లిటిల్ చాంప్స్’ పాటల కార్యక్రమానికి ఎంపికైంది. అందులో టాప్ టెన్‌లో ఒకరిగా నిలిచింది కూడా. అయితే అదంతా తన ప్రతిభ కాదంటుందామె. తనను చూసి జాలిపడి, టాప్ టెన్‌లో చోటిచ్చారన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నానని, అప్పుడే తనలో పట్టుదల పెరిగిందని శ్రావ్య చెబుతుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు కౌనె్సలర్ జాన్ హేమంత్ కుమార్‌తో పరిచయం తన జీవితాన్ని మలుపు తిప్పిందని, పదమూడేళ్లు వచ్చాక కూడా బ్రష్‌పై పేస్ట్ ఎలా వేసుకోవాలో తెలియని తనకు, ఎవరిపైనా ఆధారపడకుండా ఎలా జీవించాలో హేమంత్ తెలియజేశారని శ్రావ్య వినయంగా చెబుతుంది. అప్పటినుంచే సంగీతం శ్రద్ధగా నేర్చుకోవడం ప్రారంభించానని చెప్పే శ్రావ్య, ఇటీవలే కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్‌గా ఉద్యోగమూ సంపాదించింది. 2011లో సోలో మ్యూజిక్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాక తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందంటుందన్న శ్రావ్య, తాజాగా ఓ ఆల్బమ్ చేస్తోంది. ఈ ఆల్బమ్‌ద్వారా సంగీతప్రియులందర్నీ ఆకట్టుకోగలనని ఆమె ధీమాగా చెబుతోంది.