యువ

అమ్మలా తినిపించే రోబో ఆర్మ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెరెబ్రల్ పాల్సీ, మస్కులార్ డిస్ట్ఫ్రొ, పార్కిస్సన్స్ సిండ్రోమ్...ఇవన్నీ మహమ్మారి వ్యాధులే. వీటితో బాధపడుతున్న రోగులు తమ పనుల్ని తాము చేసుకోలేరు. చివరకు అన్నం తినడమూ చేతకాక, అవస్థ పడుతూ ఉంటారు. అలాంటివారికోసం రోబో ఆర్మ్ ఒకటి అందుబాట్లోకి వచ్చింది. ఈ రోబో ఆర్మ్‌కి స్పూన్ అమర్చి ఉంటుంది. అలాగే నాలుగు బౌల్స్ ఉంటాయి. వాటిలో పప్పు, కూర..ఇలా నాలుగు రకాల పదార్థాలు ఉంచితే రోబో ఆర్మ్ స్వయంగా తినిపిస్తుంది. రోబో ఆర్మ్ కింద ఉన్న స్మార్ట్ బటన్స్‌ను ఆపరేట్ చేసి, ఏ బౌల్‌లో ఆహార పదార్థం కావాలో ఎంచుకోవచ్చు. అలాగే స్పూన్లను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. అన్నీ బానే ఉన్నాయి కానీ, రోగి నోరు ఎక్కడుందో రోబో ఆర్మ్‌కి ఎలా తెలుస్తుంది? అనేగా మీ ప్రశ్న. ‘టీచ్ మోడ్’ బటన్‌ను నొక్కి రోబో ఆర్మ్‌ను రోగి నోటి వరకూ ఒకసారి మాన్యువల్‌గా తీసుకెడితే, ఇక అదే గుర్తుంచుకుని, తినిపిస్తుందన్నమాట. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదూ....ఓబిఐ రోబో ఆర్మ్. ధర 4,500 డాలర్లు.