యువ

ప్రమాదాలనుంచి కాపాడే ట్రాక్ గ్రాబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా, ఐరోపాలాంటి శీతల దేశాల్లో చలికాలంలో వాహనదారుల తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. ఉష్ణోగ్రతలు సున్నాకన్నా తక్కువ స్థాయికి పడిపోయి అన్నీ గడ్డ కట్టుకు పోతుంటాయి. రోడ్లపైన కూడా మంచు అడుగుల మేర పేరుకు పోతూ ఉంటుంది. అలాంటి సమయంలో వాహనదారులు వాహనాలను నడపాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఒక్కోసారి మంచు కప్పేసిన రోడ్లపై వాహనాలు స్టార్ట్ కాక మొరాయిస్తూ ఉంటాయి. అప్పుడు వేలాది వాహనాలు ఆగిపోయి గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. రోడ్డుపై గట్టిగా ఉండే నేల పట్టు దొరక్క పోతే వాహనాలు రోడ్డుపైనుంచి జారిపోయి ఏ లోయలోనో, గోతుల్లోనో పడిపోవడమో లేదా ఏ కొండరాయిని ఢీకొట్టడమో జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రమాదాలనుంచి తప్పించుకోవడానికి అనువైన సాధనమే ఈ ‘ట్రాక్ గ్రాబర్’. ఒక్కోటి ఎనిమిది అంగుళాల పొడవు, మూడంగుళాల వెడల్పు, ఒక అంగుళం మందం ఉండే రెండు సాధనాలు ఇవి. దీన్ని మీ ఫోర్‌వీలర్ ముందు టైర్లకు అమర్చడం చాలా సులభం. చాలా గట్టి రబ్బరుతో తయారు చేసిన వీటిని వాహనాల టైర్లకు అమర్చుకోవడం వల్ల మంచు కప్పడిపోయిన రోడ్లపైనుంచి వాహనాలు జారిపోయి ప్రమాదాలు జరక్కుండా చూసుకోవచ్చు. వీటి ఖరీదు కూడా ఎక్కువేమీ కాదు. ఒక్కో సెట్ ఖరీదు 49.99 డాలర్లు మాత్రమే. శీతాకాలం మంచు కప్పడిన రోడ్లపై ప్రమాదాలనుంచి కాపాడుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. *