యువ

థార్ ఎడారిలో లాభాల సాగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయం... ఈ పేరు చెబితేనే బెంబేలెత్తే పరిస్థితులు నెలకొంటున్న రోజులివి. పేపర్లు తిరగేస్తే, రోజూ అన్నదాతల ఆత్మహత్యల వార్తలే. రైతులు సైతం వ్యవసాయాన్ని వదిలేసి, కూలీ పనులకోసం పట్టణాలకోసం వలస పోతున్నారు. అలాంటి రోజుల్లో ఇంజనీరింగ్ చదివిన ఓ కుర్రాడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, పొలం బాట పట్టాడు. సేద్యానికి తన తెలివితేటలతో పదును పెట్టి, లాభాల దిగుబడిని సాధించాడు.
ఆలోచనలు అందరికీ రావచ్చు. వచ్చిన ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం మాత్రం అందరికీ చేతకాదు. అందుకు ఆత్మ స్థయిర్యం కావాలి. నష్ట్భయాన్ని ఎదుర్కొనే తెగువ ఉండాలి. అన్నింటికీ మించి తన మీద తనకు నమ్మకం ఉండాలి. అప్పుడే ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. అలా తాను నమ్మిన ఆశయం కోసం రిస్క్ చేసి, విజయం సాధించి, నలుగురి ప్రశంసలూ పొందుతున్నాడు హరీశ్ ధన్‌దేవ్. నిన్నటివరకూ హరీశ్ అంటే తెలీని వారు కూడా ఇప్పుడు అతనికి జేజేలు పలుకుతున్నారు. అతనితో మాట కలిపేందుకు, అతని అడుగులో అడుగు వేసేందుకూ ఆరాటపడుతున్నారు.
రాజస్థాన్‌లోని జైసల్మేర్ హరీశ్ పుట్టిన ఊరు. బిటెక్ చదివి అదే ఊళ్లో మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. సొంత ఊరు... గవర్నమెంట్ ఉద్యోగం. నిజానికి ఏ కుర్రాడికైనా ఇంతకంటే ఏం కావాలి? హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఉండొచ్చు. కానీ వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టిన హరీశ్‌కు చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగమే అయినా, ఎంతసేపూ వ్యవసాయంపైనే మక్కువ. ఓసారి ఢిల్లీలో జరుగుతున్న ఆగ్రి-ఎక్స్ పోకు వెళ్లాడు. రకరకాల వ్యవసాయ ఉత్పత్తుల్ని చూశాక అతని మనసు నిలవలేదు. ఇంటికొచ్చాక కూడా అదే ఆలోచన. చివరకు ఏదైతే అదవుతుందని ఓ శుభ ముహూర్తాన ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. అయినవాళ్లంతా చీవాట్లు పెట్టినా పట్టించుకోలేదు. జై సల్మేర్ శివార్లలో 120 ఎకరాల పొలంలో అలో వెరా (కలబంద) మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. నిజానికి రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో పండే అలో వెరా మొక్కలకు ఎంతో డిమాండ్ ఉంది. ఈ మొక్కలను భారీయెత్తున పతంజలి ఫుడ్ ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తుంది. అలో వెరాలోనే ‘బేబీస్ డెన్సిస్’ అనే రకాన్ని పండించడం మొదలు పెట్టాడు హరీశ్. ఈ రకం కలబంద మొక్కలకు బ్రెజిల్, హాంగ్‌కాంగ్, అమెరికా వంటి దేశాల్లో బాగా డిమాండ్ ఉంది. దీంతో హరీశ్ పంట పండింది. మొదట్లో 80 వేల మొక్కల పెంపకంతో సాగు ప్రారంభించిన హరీశ్, ఇప్పుడు ఏడు లక్షలకు పైగా మొక్కల్ని పెంచుతున్నాడు. విదేశాలకు ఎగుమతి చేయడంతోపాటు ప్రాసెస్ చేసిన అలో వెరా పల్ప్‌ను హరిద్వార్‌లోని పతంజలి ఫ్యాక్టరీకి పంపుతున్నాడు. గత నాలుగు నెలల్లోనే ఇలా 125 టన్నుల పల్ప్‌ను అతను ఎగుమతి చేశాడు. హరీశ్ స్థాపించిన ‘నేచురెలో ఆగ్రో’ సంస్థ టర్నోవర్ ఇప్పుడు అక్షరాలా రెండు కోట్ల రూపాయలు.