యువ

టెన్నిస్ బంతులే వైర్‌లెస్ స్పీకర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్, ఫ్రెంచ్, అమెరికన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్స్‌ను గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్స్ అంటారు కదా. ఏటా ఈ నాలుగు టోర్నమెంట్లలో ఉపయోగించిన తర్వాత సుమారు 2,30,000 బంతులు వృథా అవుతున్నాయట. లండన్‌కు చెందిన ప్రముఖ డిజైన్ కంపెనీ రోగ్ ప్రాజెక్ట్స్ ఇలా వృథాగా పడేస్తున్న టెన్నిస్ బంతుల్ని తిరిగి ఉపయోగంలోకి తేవాలనుకుంది. అనుకున్నదే తడవు ఈ బంతులతో వైర్‌లెస్ స్పీకర్లను తయారు చేసి, మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. బంతిని కొద్ది మేర కట్ చేసి, వాటిలో బ్లూటూత్ స్పీకర్లను అమర్చింది. స్పీకర్లను స్విచ్ ఆన్, ఆఫ్ చేసేందుకు బంతిపై ఓ బటన్‌ను ఏర్పాటు చేసింది. వీటికి ‘హియర్ ఓ’ అని పేరు పెట్టి, అమ్మకాలకు తెర తీసింది. ఒక్కో స్పీకర్ ధర 60 డాలర్లట!