యువ

చక్రమే సైకిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైకిలంటే రెండు చక్రాలు ఉండాల్సిందేనా? ఎందుకంటున్నాడు మాంట్రియేల్‌కు చెందిన కార్ల్ డేజ్‌నయాస్. వింత వింత సైకిళ్లు, మోటార్ సైకిళ్లు డిజైన్ చేయడంలో పేరొందిన కార్ల్, తాజాగా రూపొందించిన ‘మోటో పోగో’ ఎలక్ట్రిక్ సైకిల్ సంచలనం సృష్టిస్తోంది. బ్యాటరీతో నడిచే ఈ సైకిల్‌కు ఒకే ఒక చక్రం ఉంటుంది. దానిని బ్యాలెన్స్ చేస్తూ నడపగలిగితే చాలు. ఒకసారి బ్యాటరీని చార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం వెళ్ల గలిగే సామర్థ్యం ఉన్న మోటో పోగో...కాలుష్యం వెదజల్లే పెట్రోల్, డీజిల్ మోటార్ సైకిళ్లకు సవాల్ విసురుతుందనడంలో సందేహం లేదు. మోటో పోగో 150 కేజీల బరువును సునాయాసంగా మోస్తుందట. ఆటోమేటిక్ బ్రేక్స్, హెడ్ లైట్, టెయిల్ లైట్‌తో చూడటానికి ముచ్చటగా ఉన్న మోటో పోగో ధర 2,350 డాలర్లట.