యువ

ఫారాడే ఫ్యూచర్ ‘ఎఫ్‌ఎఫ్ జీరో1’ కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు ఫారాడే ఫ్యూచర్ కంపెనీ పేరు వినే ఉంటారు. ఇప్పుడు అమెరికాకు చెందిన ఆ కంపెనీ తన మొట్టమొదటి ఇవి (ఎలక్ట్రిక్ వెహికిల్) కానె్సప్ట్ కారును ఈ ఏడాది లాస్ వేగాస్‌లో జరిగిన ప్రపంచ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ టెక్నాలజీ వాణిజ్య ప్రదర్శన (సిఇఎస్-2016)లో ఆవిష్కరించింది. దాని పేరు ‘ఎఫ్‌ఎఫ్ జీరో1’. ఈ ఫారాడే ఫ్యూచర్ ‘ఎఫ్‌ఎఫ్ జీరో 1’ కారు వెయ్యి హార్స్‌పవర్ ఇంజన్ కలిగి గంటకు 200 మైళ్ల గరిష్ఠ వేగంతో నడుస్తుంది. అంతేకాదు, కేవలం మూడు సెకన్ల లోపే సున్నానుంచి 60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు. అయితే ఈ కొత్త కారు కేవలం కానె్సప్ట్ కారు మాత్రమే. కంపెనీ రాబోయే రోజుల్లో దీన్ని మార్కెట్లో విడుదల చేస్తుంది. ఉత్తర లాస్ వేగాస్‌లో వంద కోట్ల డాలర్ల విలువైన తమ ఫ్యాక్టరీలో ఫారాడే ఫ్యూచర్స్ ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్‌ను తయారు చేస్తుంది. ఫారాడే ఫ్యూచర్ ‘ఎఫ్‌ఎఫ్ జీరో 1’ కానె్సప్ట్‌లో ఉపయోగించిన ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌నే ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ (ఇవి)లోను ఉపయోగిస్తారు. అయితే ఈ కారు మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనం గనుక మార్కెట్లోకి వస్తే పెట్రోలు, డీజిలు వాహనాల వల్లఎదురవుతున్న వాతావరణ కాలుష్యానికి కొంతమేరకైనా సమాధానం లభిస్తుంది.