యువ

పెట్స్‌కోసం ఓ వీడియోఫోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంతువుల్ని పెంచుకోవడం బాగానే ఉంటుంది గానీ, అర్జెంటు పని మీద ఒకటి, రెండు రోజులు వాటిని ఇంట్లో వదిలి బయటకు వెళ్లాలంటేనే మహా ఇబ్బంది. వాటి బాగోగులు చూసే వారెవరూ ఉండరంటూ మన పనిని పోస్ట్‌పోన్ చేసుకోక తప్పదు. అయితే ‘పెట్ చాట్స్’ (ఔళఆ ష్ద్ఘఆచీ) అనే గాడ్జెట్‌ను కొనుక్కుంటే ఇక ఆ బాధే ఉండదు. ఇదో వీడియో ఫోన్ పరికరం. దీనిని పెంపుడు జంతువుల ఎత్తులోనే గోడకు అమర్చి, వైఫైతో కనెక్ట్ చేయాలి. ఇందులోనే పెంపుడు జంతువులు తినే బిస్కెట్లు, ఇతర ఆహార పదార్ధాల్ని నింపే సౌకర్యమూ ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా కంప్యూటర్‌లో పెట్ చాట్స్‌తో కనెక్ట్ అయి, పెట్ యానిమల్స్‌ను చూస్తూ పలకరించవచ్చు. ఓ ప్రత్యేకమైన రింగ్ టోన్‌ను పెంపుడు జంతువులకు అలవాటు చేస్తే, రింగ్ మోగగానే అవి ఇంట్లో ఎక్కడున్నా వీడియో ఫోన్ దగ్గరకు వస్తాయి. వాటిని చూస్తూ మాట్లాడొచ్చు. అలాగే వాటికి బిస్కెట్లనూ వేయొచ్చు. ఇందుకోసం మీరు కంప్యూటర్‌లో ఔళఆష్ద్ఘఆచీ.ష్యౄలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదా సదరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెట్ చాట్స్ ధర 349 డాలర్లు.