యువ

మీ దుస్తులూ మాట్లాడతాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి అందరికీ తెలుసు. మరి, ఇంటర్నెట్ ఆఫ్ క్లోత్స్ గురించి తెలుసా? లేదు కదూ! బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్శిటీకి చెందిన ఓ పరిశోధకుల బృందం ఆలోచన ఇది. అసలు విషయానికొస్తే... మార్కెట్లో కంటికి నదరుగా కనిపించిన దుస్తులు కనిపిస్తే కొనేయడం చాలామందికి అలవాటు. అలా వార్డ్‌రోబ్ నిండిపోతుంది. వాటిలో రోజూ వేసుకునేవి మాత్రం కొనే్న. ఇది చాలామందికి అనుభవైకవేద్యమే. అయితే వార్డ్‌రోబ్‌లో ఓ మూలనపడి మగ్గుతున్న దుస్తుల్ని వెలికితీసి, ఏ అనాథ శరణాలయానికో ఇస్తే వాటికో ప్రయోజనం. కానీ అంత తీరిక, ఓపికా ఎవరికుంటుంది? అయితే ‘ఇంటర్నెట్ ఆఫ్ క్లోత్స్’తో ఇక ఆ సమస్య తీరినట్టే. మీరు వేసుకోని దుస్తులు నేరుగా ఏ ఛారిటీనో సంప్రదిస్తాయి. మేం వృథాగా పడిఉన్నాం...మమ్మల్ని తీసుకెళ్లండని ప్రాధేయపడతాయి. అవునండీ... ఇదంతా నిజంగా నిజం. కట్టుకథ కాదు. వినియోగదారుడు ధరించే దుస్తులకు ఆర్‌ఎఫ్‌ఐడి (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్ ఉంటుంది. వీటిని మానిటర్ చేసేందుకు వార్డ్‌రోబ్‌లో ఓ ఆర్‌ఎఫ్‌ఐడి రీడర్‌ను ఉంచితే సరి. ట్యాగ్స్‌ను ఈ రీడర్ రోజూ మానిటర్ చేస్తుంది. ఏయే దుస్తుల్ని సదరు వినియోగదారుడు ధరిస్తున్నాడు, వేటిని ధరించడం లేదు అనే విషయాల్ని వైఫై ఆధారంగా పనిచేసే రాస్ప్‌బెర్రీ మైక్రోకంప్యూటర్ ద్వారా నోట్ చేసి, వినియోగదారుడి మొబైల్‌కు సమాచారం అందిస్తుంది. ఈ సమాచారాన్ని వినియోగదారుడు పట్టించుకోకపోతే, సమాచారం దగ్గర్లో ఉన్న ఛారిటీ సంస్థకు అందుతుంది. సంస్థ ప్రతినిధులు నేరుగా వినియోగదారుణ్ని సంప్రదించి, వృథాగా పడి ఉన్న దుస్తుల్ని తమకు ఇవ్వమని అడుగుతారు. అలాగే ఇబే వంటి ఆన్‌లైన్ సంస్థలకూ సమాచారం అందుతుంది. దీనివల్ల వినియోగదారుడికి లాభం కూడా చేకూరుతుంది. అయితే, ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ‘ఇంటర్నెట్ ఆఫ్ క్లోత్స్’ వాడకంలోకి రావడానికి మరికొన్ని నెలలు పట్టొచ్చు.