యువ

పారాచూట్ లేకుండా ప్రాణాలతో చెలగాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కై డైవర్లకు పారాచూటే ప్రాణం. అది లేకుండా దూకమంటే దూకేందుకు వెర్రివాళ్లు ఎవరూ ఉండరు. కానీ అలాంటి సాహసం చేశాడు లూక్ ఐకిన్స్. పారాచూట్ లేకుండా పాతిక వేల అడుగుల ఎత్తునుంచి దూకి, ప్రపంచంలోనే ఇలాంటి ఫీట్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సాహసోపేత విన్యాసంలో ఏ మాత్రం తేడా వచ్చినా లూకిన్స్ ప్రాణాలు గాల్లోనే కలిసిపోయి ఉండేవి. ఐకిన్స్ పేరొందిన స్కై డైవర్. ఇప్పటికి 18వేల సార్లు స్కై డైవింగ్ చేసిన అనుభవం అతని సొంతం. ఓసారి స్నేహితుడు క్రిస్ టాలీ వచ్చి, పారాచూట్ లేకుండా స్కై డైవింగ్ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చాడు. స్కై డైవింగ్‌లో ఎంత అనుభవం ఉన్నా పారాచూట్ లేకుండా చేయడమనేది ప్రాణాలతో చెలగాటం కాబట్టి ఆ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించాడు ఐకిన్స్. అయితే టాలీ వెళ్లాక లూకిన్స్ ఆలోచనలో పడ్డాడు. చేస్తే అలాంటి సాహసమే చేయాలనుకున్నాడు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకున్నాక, టాలీని పిలిచి సంసిద్ధత వ్యక్తం చేశాడు. ఇక అప్పటినుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రెండేళ్లపాటు సుదీర్ఘమైన కసరత్తు చేసిన అనంతరం జూలై 30న ప్రదర్శనకు సిద్ధపడ్డాడు. అమెరికాలోని సిమీ వాలీ సమీపంలో ఏర్పాట్లు జరిగాయి. వంద అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పు కలిగిన పెద్ద నెట్‌ను అమర్చారు. పాతిక వేల అడుగుల ఎత్తునుంచి ఐకిన్స్ పడితే తట్టుకునేందుకు వీలుగా నెట్‌ను రూపొందించారు. అయితే, విమానం ఎక్కేముందు ఐకిన్స్‌కు అనుకోని అవాంతరం ఎదురైందట. ఈ ప్రదర్శన నిర్వాహకులైన స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ బృందం చివరి నిమిషంలో ఐకిన్స్‌ను పారాచూట్ ధరించాల్సిందిగా ఒత్తిడి చేశారట. అయితే ప్రదర్శనైనా విరమించుకుంటా గానీ, పారాచూట్ మాత్రం ధరించనని లూకిన్స్ మొండికేశాడట. దీనికి కారణం ఉంది. వీపునకు పారాచూట్ కట్టుకుని దూకితే దిశానిర్దేశం కష్టమవుతుందని, తనకు ప్రాణాపాయం కూడా జరుగుతుందన్నది ఐకిన్స్ భయం. చివరకు అతని వాదనతో యాక్టర్స్ గిల్డ్ ఏకీభవించడంతో ఐకిన్స్‌కు లైన్ క్లియర్ అయింది. ఐకిన్స్‌తోపాటు మరో ముగ్గురు సహచరులు కూడా డైవ్ చేశారు. వీరిలో ఒకరు కెమెరాను చేతపట్టుకుంటే, మరొకరు ఆక్సిజన్ సిలిండర్‌తో ఐకిన్స్‌కు సాయం చేశారు. ఇంకొకరు పొగ గొట్టం చేతపట్టుకున్నారు. (ఇది కింద ఉన్న వీక్షకులకు లూకిన్స్ ఎక్కడున్నాడో చూపించేందుకు అన్నమాట). అనుకున్నట్టుగానే ఐకిన్స్ సరిగ్గా నెట్‌లోకే పడటంతో అక్కడ ఉన్న వేలాదిమంది ఆనందాతిరేకంతో కరతాళధ్వనులు చేశారు. నెట్‌లోంచి బయటకొచ్చిన ఐకిన్స్ అక్కడే ఉన్న భార్యను కౌగలించుకుని, ఆమె చేతుల్లో ఉన్న నాలుగేళ్ల కొడుకును ముద్దాడాడు. పాతికవేల అడుగుల ఎత్తునుంచి ఐకిన్స్ నేలను చేరేందుకు పట్టిన సమయమెంతో తెలుసా....కేవలం రెండున్నర నిమిషాలు. స్నేహితుడు ట్రాలీ ప్రతిపాదనను తిరస్కరించి ఉంటే తనకీ కీర్తిప్రతిష్ఠలు దక్కేవి కాదని సవినయంగా చెబుతాడు ఐకిన్స్.