యువ

మీ మెంటాలిటీ ఎలాంటిది!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ పని చేసినా అది మంచికే జరగాలి. అది చిన్నదైనా పెద్దదైనా చివరికి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లేదైనా సరే..దీని వెనుక బలమైన కారణం ఉండాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు విచక్షణ, సహేతుకత కనిపించాలి. వివేచనతో వ్యవహరించకపోతే అ తర్వాత చింతించాల్సిందే! అంటే మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకు లబ్ధి చేకూరాలే తప్ప దాని వల్ల మరిన్ని సమస్యలు కొనితెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు.

ఎలా ఉంటే కెరీర్ ఉంటుందో..ఎలా ఉండకుండా ఉంటే తదుపరి ఎదుగుదలకు ఆస్కారం ఉంటుందో ‘లింక్డ్‌ఇన్’ అనే ఓ సంస్థ
కళ్లకు కట్టింది. ఇందుకోసం పదివేల మంది మనస్తత్వాలను
వడపోసి ‘మార్గ’నిర్దేశనా చేసింది. 53 శాతం మందికి పైగా ఉద్యోగులు మెరుగైన అవకాశాల కోసమే ఉద్యోగం మారినట్లు ఆ సర్వేలో తేలింది. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. బహుశా దానికి కారణం అలాంటి వారిలో ‘కెరీర్ కిల్లింగ్ మెంటాలిటీ’ (కెరీర్‌ను చంపే మనస్తత్వం) ఉండి ఉండవచ్చు. ఇదిలా ఉంటే ఉద్యోగుల్లో 80 శాతం మందికి పైగా తాము చేసే ఉద్యోగం మరీ ముఖ్యంగా తమ కెరీర్ ఎదుగుదల పట్ల అసంతృప్తితో ఉంటున్నట్లు కూడా ఆ సర్వే గుర్తించింది.

నేటి పోటీ వాతావరణంలో అవకాశాలు అరుదుగానే వస్తాయి. వాటిని సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయంతో అందిపుచ్చుకోగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. అంతేకానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తే మాత్రం ఎలాంటి ప్రయత్నమైనా వృథా ప్రయాసే అవుతుంది. ఇలా వచ్చిన అవకాశాలను చేజేతులా వదులుకుని ఆనక చింతించేవారు కొందరైనా..డైలమాలో ఎటూ తేల్చుకోలేక ఉన్నదాన్నీ..వచ్చే అవకాశాన్నీ జార విడుచుకునే వారు మరి కొందరు. అయితే..కెరీర్‌ను నాశనం చేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు కానీ..కొన్ని రకాల పరిస్థితులు, మనస్తత్వాలు ఇందుకు ప్రధానంగా కారణమవుతాయి. ఇలాంటి మెంటాలిటీ ఎవరికున్నా.. దాని వల్ల కలిగేది నష్టమే తప్ప లాభం ఉండదు. కెరీర్ చేజేతులా నాశనం చేసుకునే మనస్తత్వం ఎలాంటిది.. దాన్ని అధిగమించేందుకు ఎలా వ్యవహరించాలన్న అం శంపై జరిగిన సర్వే ఎన్నో చేదునిజాలనే కళ్లకు కట్టింది. ఎలా ఉంటే కెరీర్ ఉంటుందో..ఎలా ఉండకుండా ఉంటే తదుపరి ఎదుగుదలకు ఆస్కారం ఉంటుందో ‘లింక్డ్‌ఇన్’ అనే ఓ సంస్థ కళ్లకు కట్టింది. ఇందుకోసం పదివేల మంది మనస్తత్వాలను వడపోసి ‘మార్గ’నిర్దేశనా చేసింది. 53 శాతం మందికి పైగా ఉద్యోగులు మెరుగైన అవకాశాల కోసమే ఉద్యోగం మారినట్లు ఆ సర్వేలో తేలింది. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. బహుశా దానికి కారణం అలాంటి వారిలో ‘కెరీర్ కిల్లింగ్ మెంటాలిటీ’ (కెరీర్‌ను చంపే మనస్తత్వం) ఉండి ఉండవచ్చు. ఇదిలా ఉంటే ఉద్యోగుల్లో 80 శాతం మందికి పైగా తాము చేసే ఉద్యోగం మరీ ముఖ్యంగా తమ కెరీర్ ఎదుగుదల పట్ల అసంతృప్తితో ఉంటున్నట్లు కూడా ఆ సర్వే గుర్తించింది. ఈ దిగువ మనస్తత్వాల్లో ఏ ఒక్కటైనా కొద్ది పాటిగానైనా మీలో ఉంటే ఒక ప్రొఫెషనల్‌గా ఎదగనీయకుండా మీ సామర్థ్యాన్ని అది చంపేస్తుంది.
మీ కెరీర్‌ను చంపేసే ఆ మనస్తత్వం ఏమిటో మీరు ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత త్వరగా దాన్ని తొలగించుకోగలుగుతారు కూడా.
నిత్య అసంతృప్తవాదులు
ఇలాంటి వ్యక్తులు తమ కెరీర్‌లో తీసుకునే ప్రతీ విషయం గురించి ఎక్కువగా ఆలోచించడమేకాదు ప్రతి దానిలోనూ అడ్డంకులు, లోపాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు తమ కెరీర్‌లో తదుపరి చర్య గురించి గంటలు, రోజులే కాదు... ఒక్కోసారి సంవత్సరాల తరబడి ఆలోచిస్తూ గడిపేస్తూ ఉంటారు. అయితే కాలం మన కోసం ఆగదు కదా! చివరికి అలా ఆలోచిస్తూ వృథా చేయడానికి వారికి సమయం అంటూ ఏమీ మిగలదు. ఎందుకంటే అప్పటికి వారు తమ ఉద్యోగాల్లో చివరి దశకు చేరుకునేస్తారు. అయితే వారు ఏదయినా తమ కెరీర్‌లో కొత్త స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోకపోతే అలాంటి వారిని కొనసాగించడం వల్ల కంపెనీకి ఏం లాభముంటుంది? అందుకే కంపెనీ పునర్వ్యవస్థీకరణలో జరిపే తొలగింపుల్లో భాగమై పోవడంతో పాటు కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవలసిన స్థితికి చేరుకుంటారు.
సీతయ్యలూ ఉంటారు!
కెరీర్‌లో కొత్తగా ఎలాంటి మార్పూ రావాలని కానీ, ఎదగాలని కోర్కె కానీ తనకు లేదని అనుకుంటూ ఉండే మరికొంతమంది వ్యక్తులు ఉంటారు. అంతేకాదు తన ఆలోచనలన్నీ కూడా ఇతరులకన్నా చాలా గొప్పవని అనుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నాన్‌స్టాప్‌గా పని చేస్తూ ఉంటారు. ఫలితంగా ఒక్కోసారి ఆలోచించే ఓపిక లేని స్థితికి చేరుకుంటారు. అలాంటి వ్యక్తులు తమ ఆలోచనలను మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. పైగా తమ ఆలోచనే సరైనదని మొండిగా వాదిస్తూ ఉంటారు. ఫలితంగా పదోన్నతుల సమయంలో కంపెనీ యాజమాన్యం అలాంటి వారిని పట్టించుకోకపోవడమో లేదా మిగతా వారితో కలిసిమెలిసి పని చేయడం లేదన్న కారణంగా ఉద్యోగంనుంచి తొలగించే పరిస్థితి వస్తుంది.
మాటలే ఘనం
ఇలాంటి వాళ్లు తమ కెరీర్ గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప చేతల్లో మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోరు. వాళ్ల ఆలోచనలన్నీ చాలా ఉన్నతమైనవని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. తాను తలచుకుంటే ఏ పనిలోనైనా విజయం సాధించేయగలమని ఎదుటి వాళ్లను నమ్మించడానికి వాళ్లు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు . అయితే వాళ్లు సాధించిందేమీ ఉండదు. ఫలితంగా వాళ్లు ఎలాంటి ఎదుగుదలా లేకుండా ఎక్కడ వేసిన గొంగళి తరహాలో ఉన్న చోటే ఉండిపోతారు. చివరికి ఎవరు కూడా వాళ్ల మాటలను నమ్మరు సరికదా వ్యాపారానికి సంబంధించిన విషయాలే కాదు, మామూలుగ కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడక వారిని దూరంగా ఉంచుతారు.
లక్‌పైనే ఆశ
అదృష్టమే తమ కెరీర్‌ను నిర్ణయిస్తుందని మరికొంతమంది వ్యక్తులు బలంగా నమ్మే వ్యక్తులు మరికొందరుంటారు. అవకాశాలు హఠాత్తుగా ఆకాశంనుంచి ఊడిపడి తమ ముందు నిలబడతాయని, ఎలాంటి శ్రమా లేకుండా కెరీర్‌లో అలా.. అలా అంచెలంచెలుగా ఎదిగి పోతామని వారు బలంగా నమ్ముతుంటారు. అంతేకాదు కొత్తగా ఎలాంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోకుండానే ఒక ఉద్యోగంనుంచి మరో ఉద్యోగానికి మారుతూ ‘కోతి కొమ్మచ్చి’ ఆట ఆడేస్తూ ఉంటారు. ఇలా ఉద్యోగాలు మారడం తమకు బాగానే ఉందని, ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నామని వాళ్లు చెప్పవచ్చు కానీ చివరికి అవకాశాలు తగ్గిపోయి రిటైరయ్యే సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితికి చేరుకోవచ్చు కూడా.
చూశారుగా.. పైన చెప్పినవన్నీ కూడా మీ కెరీర్‌ను దెబ్బతీసే లక్షణాలే. అలాంటి వాటిలో ఏ ఒక్కటైనా మీలో ఉన్నట్లనిపిస్తే వెంటనే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ కెరీర్ ప్రమాదంలో పడిపోతుంది.
*