యువ

నవ్వు... నవ్వించు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం..నవ్వలేకపోవడం ఒక రోగం..అన్నాడు జంధ్యాల. నవ్వు..నవ్వించు...నీ నవ్వులు పండించు అన్నాడో కవి. ఆ నానుడిని నిజం చేస్తూ..
అమెరికాలో అన్యభాషలో నవ్వులు పండిస్తూ...
హాస్యాన్ని పంచుతోంది మన తెలుగు అమ్మాయి అపర్ణ నాంచర్ల.
కమెడియన్‌గా సత్తా చూపుతోంది..
నవ్వు నాలుగు విధాల మేలు..అని హాస్యరసాన్ని చిలికిస్తూ హాస్య రచనలు చేస్తూ...అమెరికా టీవీ షోలలో హల్‌చల్ చేస్తున్న అపర్ణ..మన హైదరాబాద్ అమ్మాయే. తెలుగు అమెరికన్..అపర్ణ నాంచర్ల అంటే..టీవీ షోలలో ఇప్పుడు ఓ బ్రాండ్..విజయానికి మారుపేరు..అమెరికా టీవీల్లో ‘ది మిండీ ప్రాజెక్ట్’, అజీజ్ అన్సారీ ‘మాస్టర్ ఆఫ్ నన్’ వంటి షోలకు దీటుగా అపర్ణ హాస్య రచనలు..వెబ్ సిరీస్..టీవీ షోలు ప్రజాదరణ పొందుతున్నాయి.
అపర్ణ 34 ఏళ్ల సాదాసీదా అమ్మాయి. బాల్యమంతా వాషింగ్టన్ డిసిలోనే గడిచింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న అపర్ణ హైదరాబాద్‌లో పుట్టినా, చిన్నప్పుడే తల్లిదండ్రులతో అమెరికాకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులిద్దరూ వృత్తిరీత్యా వైద్యులు. ఇంట్లో అమ్మా నాన్నా తెలుగులోనే మాట్లాడుకుంటారు. పిల్లలకూ తెలుగే నేర్పారు. అపర్ణ, ఆమె అక్క కూడా తెలుగులోనే అమ్మానాన్నలతో మాట్లాడుతున్నా..ఇరుగు పొరుగుతో హిందీలో, ఇంగ్లీషులో సంభాషిస్తారు. అమెరికాలో ఉన్నా అటు పాశ్చాత్య సంస్కృతితో పాటు భారతీయ సంస్కృతినీ అపర్ణ ఆకళింపు చేసుకుంది. ఇండియన్ కమ్యూనిటీ...సాంస్కృతిక ఉత్సవాల్లోనూ, తెలుగు కమ్యూనిటీ నిర్వహించే ఉత్సవాల్లోనూ ఉత్సాహంగా పాల్గొనడం...ఆమెలో హాస్యంపట్ల, హాస్య రచనపట్ల ఆసక్తిని పెంచింది.
హైస్కూల్‌లో చదువుతున్నప్పుడే అపర్ణ హాస్య రచనకు శ్రీకారం చుట్టింది. మొదట్లో కొంత తడబాటు పడేదట. తన రచనలు తనకే నచ్చని పరిస్థితిలో కొంత నిస్పృహ చెందినా..వాటిని అధిగమించి, హాస్యరచనలో నిలదొక్కుకుంది అపర్ణ.
అమ్మానాన్నలు ఇచ్చిన ఊతం...తోటి తెలుగువాళ్లు ఇచ్చిన ప్రోత్సాహం...అపర్ణ హాస్యరచనకు మెరుగులుపట్టాయి. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన తెలుగమ్మాయి..అమెరికాలో పుట్టి పెరిగిన రచయితలతో పోటీ పడడం నిజంగా కత్తిమీద సామే...అయినా లక్షలాదిమంది ప్రజల గుండెలను తట్టి వారిని హాస్యరసంలో ముంచెత్తుతూ..చక్కటి హాస్య గల్పికలు అల్లుతూ అందరినీ అలరిస్తోంది అపర్ణ. నవ్వులో ఉండే పరమార్ధం...ఆరోగ్యమేనని వారిలో చైతన్యం తెస్తోంది అపర్ణ నాంచర్ల
జయహో...అపర్ణ!