యువ

మనవాళ్లు పనిమంతులేనట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెలవురోజుల్లోనూ ఆఫీసు పనే
స్మార్ట్ఫోన్‌ను సద్వినియోగం చేస్తున్న ఇండియన్స్
స్మార్ట్ ఫోన్లు అందుబాట్లోకి వచ్చాక పని సులువైపోయింది. చేతిలో ఫోనుంటే ప్రపంచం మన ముంగిట్లో ఉన్నట్టే. ముఖ్యంగా ఐటి ఆధారిత సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకిది వరం. ఇంటి దగ్గరున్నా పనిమీద ధ్యాస పెట్టొచ్చు. అసలు స్మార్ట్ ఫోన్‌ను ఏ విధంగా వాడుతున్నారు? దానినెలా సద్వినియోగం చేస్తున్నారు? అనే విషయాలపై ఇజెన్షియల్/ఎక్స్‌పీడియా మొబైల్ బిహేవియర్ మొబైల్ ఇండెక్స్ అనే సంస్థ ఓ సర్వే చేసింది. 19 దేశాలకు చెందిన 18 ఏళ్లు పైబడిన 9,642మందిని సర్వే చేయగా ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మనం మరీ గొప్పగా చెప్పుకోవలసిన అంశమేమిటంటే- ఎనభై శాతం మంది భారతీయులు స్మార్ట్ ఫోన్‌ను ఆఫీసు పనికోసం ఎక్కువగా వాడుతున్నారట. అదీ సెలవు రోజుల్లో కూడా రోజుకోసారైనా ఆఫీసు పని ఇంకా ఎంత చేయాల్సి ఉంది, ఎంతవరకూ జరిగింది అనే విషయాలను తెలుసుకునేందుకు వాడుతున్నారట. నార్త్‌స్టార్ అనే ఏజన్సీ సాయంతో ఉత్తర అమెరికా, ఐరోపా, దక్షిణ అమెరికా, ఆసియా పసిఫిక్ దేశాల్లో జరిపిన ఈ ఆన్‌లైన్ సర్వేలో ఇండియా తరవాతి స్థానంలో థాయ్‌లాండ్ (74శాతం) ఉంది. ఆఫీసు పనికి సంబంధించి భారతీయులు రోజుకు గంట సమయం కేటాయిస్తున్నారట. అలాగే 29 శాతం మంది ఇండియన్స్ రోజూ అరగంటసేపు ఇమెయిల్స్ లేదా వాయిస్ మెయిల్స్ చెక్ చేసుకోవడంలో గడుపుతున్నారని సర్వేలో తేలింది. దాదాపు 74శాతం మంది భారతీయులు సెలవు రోజుల్లో కేఫ్‌లు, రెస్టారెంట్లలో ఫ్రీ వైఫై వినియోగంపై మక్కువ చూపుతున్నారని తేలింది. ఇక 56 శాతం మంది భారతీయులు ప్రయాణాల్లో ఉన్నప్పుడు స్మార్ట్ఫోనే తమ లోకంగా గడుపుతున్నారట. వారిలో 36శాతం మంది తమ వెంట చార్జర్లనూ తీసుకువెడుతున్నారట.