యువ

మనం ఎవరికి తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఐదేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ క్రీడల పట్ల ఎనలేని ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సింధూ, కర్మాకర్, దీపలు సాధించిన ఒలింపిక్ విజయాలు యువతుల్లో తాము భిన్న క్రీడా రంగాల్లో రాణించాలన్న పట్టుదలను పెంచాయ. జీవితంలో చదువెంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం ఒకప్పుడు చదువుకుంటేనే ఉద్యోగమన్న భావన బలంగా ఉండేది. ఇప్పుడు చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తే వ్యక్తిగతంగానూ, దేశానికి పేరు తెచ్చే రీతిలో విజయాలను నమోదు చేసుకుంటే భవితకు తిరుగుండదన్న పట్టుదల పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ క్రీడల పట్ల యువోత్సాహం కట్టలుదెంచుకుంటుంది. ఆటల ఆడటమంటే కేవలం పతకాలే లక్ష్యం కాదు వాటి వల్ల ఆరోగ్యం ఇనుమడిస్తుందన్న ప్రాథమిక భావన కూడా యువతీ యువకుల్లో పెంపొందుతుంది. ‘మాకేం తక్కువ మేమెందుకు రాణించలేం అవకాశాలొస్తే అద్భుతాలనే సాకారం చేసుకుంటాం’ అనే ధీమా యువతలో కలగడమనేది యువభారతానికే అనుకోని వరమే. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత భారత్‌కు ఉంది. అది భవిత తమదేనని చెప్పే యువ సంపద అంటే భారత్‌లో ఉన్నంత యువ జనాభా అనేక దేశాల మొత్తం జనాభాను కలిపినా ఎక్కువే. మరి మనం ఎవరికి తక్కువ.