యువ

భాష ఏదైనా పర్లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండమన్నారు సరే! కానీ భాష సంగతేమిటి? నిజానికి రోమ్ అనే కాదు...ఏ దేశానికి వెళ్లినా అక్కడి స్థానిక భాష మనకు రాదు. వాళ్లకెలా చెప్పాలో తెలీక తికమక పడతాం. ఇక నిరంతరం ప్రయాణంలో ఉండే యాత్రికులకైతే ఈ సమస్య దినదిన గండం... నూరేళ్ల ఆయుష్షులాంటిదే. ఈ సమస్యను అధిగమించేందుకు మార్కెట్లోకి ఓ ఇయర్‌పీస్ వచ్చింది. దాని పేరు ‘పైలట్’. దీనిని చెవిలో పెట్టుకుంటే చాలు...అవతలివారు ఏ భాషలో మాట్లాడుతున్నా, మనకు కావలసిన భాషలోకి అనువదించి అందిస్తుంది. వేవెర్లీ లాబ్స్ రూపొందించిన ఈ ఇయర్‌పీస్‌ను బ్లూటూత్‌కు అనుసంధానించుకునే వెసులుబాటు ఉంది. సంబంధిత యాప్‌ను ముందుగా డౌన్‌లోడ్ చేసుకుని, ఏ భాషలోకి అనువాదం కావాలో ముందుగానే సెట్ చేసుకోవాలి. అలాగే స్థానిక భాషకు సంబంధించిన డేటాబేస్‌ను స్మార్ట్ఫోన్‌లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి, ఇక ఇంటర్‌నెట్‌తో సంబంధం ఉండదు. గత మే నెలలో మార్కెట్లోకి వచ్చిన ‘పైలట్’లో ప్రస్తుతానికి ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, పోర్చుగీస్ భాషలు ఉన్నాయి. త్వరలో జర్మన్, హీబ్రూ, రష్యన్ భాషలతోపాటు ఆసియా, ఆఫ్రికాలకు చెందిన పలు భాషలను కూడా చేరుస్తున్నారట.
‘పైలట్’తోపాటు మరో ఇయర్‌పీస్ కూడా వస్తుంది. ఇది కేవలం మ్యూజిక్ వినేందుకు మాత్రమే. అంతా బాగానే ఉంది కానీ, ఈ ఇయర్‌పీస్ పెట్టుకుంటే ఎదుటివాళ్లు మాట్లాడే భాష మనకు కావలసిన భాషలోకి అనువాదమై, మనకు అర్థమవుతుంది. మరి, మనం మాట్లాడే భాష ఎదుటివాళ్లకు అర్థం కావాలంటే ఎలా? ఈ ప్రశ్నకు మాత్రం ‘పైలట్’ వద్ద సమాధానం లేదు.