యువ

భావి తరానికి బంగారుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్టు 15...!
ఊరంతా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే...అదే జెండా పండుగను ‘నెట్ ఇంపాక్ట్’ మాత్రం అందుకు భిన్నంగా జరుపుకుంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే పనిలో ఓ బృహత్తర కార్యక్రమానే్న చేపట్టి విజయవంతంగా అమలు చేసింది. ఇంతకీ ఏం చేసింది నెట్ ఇంపాక్ట్? అసలు నెట్ ఇంపాక్ట్ అంటే ఏమిటి?

నెట్ ఇంపాక్ట్ అనేది విద్యార్థుల నేతృత్వంలో విద్యార్థులకోసం నడిచే ఓ స్వచ్ఛంద సంస్థ. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన కొందరు విద్యార్థులు నెట్ ఇంపాక్ట్‌తో చేరుూ చేరుూ కలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతుల మధ్య చదువుకునే చిన్నారులకు దిశానిర్దేశం చేసేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఒకటి కాదు రెండు కాదు...ఆరు వారాలపాటు ఏడు వర్క్ షాప్‌లు నిర్వహించారు. సంగీతం, డాన్స్, నాటకం, కళలు, క్రీడలు, యోగ, వక్తృత్వం, నైతిక విలువలు, ఫొనెటిక్స్ వంటి విభిన్న అంశాల్లో ఈ వర్క్‌షాప్‌లు జరిగాయి. వర్క్‌షాప్‌లలో నేర్చుకున్న విద్యను చిన్నారులు స్వాతంత్య్ర దినోత్సవం నాడు అందరిముందూ ప్రదర్శించి శెభాష్ అనిపించుకున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి నెట్ ఇంపాక్ట్ పెట్టిన పేరు ‘బంధన్’. బంధన్ నిర్వహణకు కావలసిన డబ్బు కోసం వారు ఎవరినీ చేయి చాచి సాయం అడగలేదు. స్వయంగా ఖర్చులు భరించారు. ‘కెరీర్ అవకాశాల గురించి మేం చిన్నారులకు విడమరచి చెప్పాం. వారిలో ఓ లక్ష్యాన్ని పాదుగొల్పేందుకు కృషి చేశాం. ఈ ఏడు వారాల్లో వారు మాకెంతో దగ్గరయ్యారు. చివరిరోజు వారిని వదిలి వచ్చేటప్పుడు మాలో ఎంతోమంది కంటతడి పెట్టుకున్నారు’ అని చెప్పారు నెట్ ఇంపాక్ట్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న చంద్రికా దేవ్. ఉపాధ్యక్షుడు చారు శేఖర్ మాట్లాడుతూ పిల్లల్లో పేరుకుపోయిన నైరాశ్యాన్ని పారదోలి, వారిలో ఉత్సాహాన్ని, భవిత పట్ల ఆశను రేకెత్తించేందుకు ‘బంధన్’ దోహదపడిందని భావిస్తున్నట్టు చెప్పారు. గతంలోనూ నెట్ ఇంపాక్ట్ ఎన్నో ప్రజోపయోగకరమైన పనులు చేపట్టిందని చెబుతూ త్వరలో విద్యార్థులకోసం ‘మెంటార్‌షిప్’ ప్రోగ్రామ్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందులోభాగంగా ఒక్కొక్క వలంటీర్ ఇద్దరు ముగ్గురు విద్యార్థులతో తరచూ కాంటాక్ట్‌లో ఉంటారని, వారికి కావలసిన సూచనలు, సలహాలు ఇస్తూ వారి కెరీర్‌ను తీర్చిదిద్దేందుకు దోహదపడతారని వివరించారు.
తమ కెరీర్‌ను తాము తీర్చిదిద్దుకుంటూ, చిన్నారుల భవితకు బంగారు బాట వేసేందుకు ప్రయత్నిస్తున్న ‘నెట్ ఇంపాక్ట్’ వలంటీర్ల సేవలు బహుధా ప్రశంసనీయం కదూ!

chitram.. నెట్ ఇంపాక్ట్ విద్యార్థుల బృందం వలెంటీర్లతో చంద్రికాదేవ్ (ఎడమ వైపు చివర), చారుశేఖర్ (కుడివైపు నుంచి రెండు)