యువ

విజయానికి ఏడు మెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్య నాదెళ్ళ...

ఈ పేరు ఎందరికో స్ఫూర్తిదాయకం.
తెలుగువాడిగా పుట్టి పెరిగి, ఇక్కడి స్కూళ్లలో చదివి, ఎదిగి మైక్రోసాఫ్ట్ సిఇఓగా అందలం ఎక్కిన సత్య నాదెళ్ల ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకమే. సత్య ప్రస్థానమే కాదు... ఆయన ప్రసంగాలు కూడా యువతను కార్మోన్ముఖుల్ని చేసేందుకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఉత్సాహాన్ని నింపుతాయి. లక్ష్యసాధనకు పురిగొల్పుతాయి. మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టాక ఆయన దేశ విదేశాల్లో పర్యటించారు. యువతను ఉద్దేశించి ఎన్నో ఉత్తేజభరితమైన ప్రసంగాలు చేశారు. అలాంటివాటిలో వివిధ సందర్భాల్లో యువతను మోటివేట్ చేసేందుకు చెప్పిన ఏడు పిట్టకథలు ‘యువ’ పాఠకులకోసం...
విశ్వాసమంటే అదీ!
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలసి రోడ్డు దాటుతున్నాడు. ఊహించనివిధంగా దూసుకొచ్చిన ఓ కారు, అతని పెంపుడు కుక్కను ఢీకొట్టింది. అనుకోని ఈ పరిణామానికి దిగ్భ్రాంతికి గురైన ఆ వ్యక్తి, కొన ఊపిరితో ఉన్న కుక్కను చేతుల్లోకి తీసుకుని, పొదివి పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ కుక్క...చివరిసారిగా యజమాని కళ్లల్లోకి చూసి, నాలుకతో అతని కన్నీళ్లు తుడిచి, కన్నుమూసింది.

గెలుపు సూత్రాలు
ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో విజయాలు సాధించాడు. ఎన్నో అందలాలు ఎక్కాడు. ఓ రోజు అతని శిష్యుడు...గురువు గారూ! మీ విజయానికి కారణాలేంటి?’అని అడిగాడు. దానికి ఆ గురువు చిరునవ్వు నవ్వి ‘్భన్నంగా ఆలోచించు. ఎవరూ చదవనిదే చదువు. ఎవరూ ఆలోచించనివిధంగా ఆలోచించు. ఇతరులెవరూ చేయనిదే చేయి. అదే నిన్ను విజయ శిఖరాలు అధిరోహింపజేస్తుంది’ అన్నాడట.

చేయూత అవసరమే!
ఓసారి సత్య నాదెళ్ల నడుస్తూ నడుస్తూ పడబోయారట. ఆ పక్కనే వీల్‌చైర్‌లో ఉన్న ఓ కుర్రాడు చటుక్కున ఆయనను పట్టుకుని ఆపాడట. అతనికి సత్య థాంక్స్ చెప్పి, ‘వీల్‌చైర్‌లో ఉన్నావు...ఏమైంది?’ అని అడిగారట. దానికి ఆ కుర్రాడు... కొనేళ్ల క్రితం తానూ కాలు జారి పడ్డాననీ, అప్పుడు తనను పట్టుకునేందుకు ఎవరూ లేర’ని అన్నాడట.

అన్నీ తెలియాలని రూలేం లేదు!
ఓ సందర్భంలో సత్య నాదెళ్లకు ఆయన తండ్రి ఇలా క్లాస్ తీసుకున్నారట...‘ ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు. ఓ సక్సెస్‌ఫుల్ ప్రోడక్ట్‌ని కనిపెట్టేందుకు నువ్వు ప్రొఫెషనల్‌వే కానక్కర్లేదు. ఆ మాటకొస్తే...గూగుల్, యాపిల్ వంటి సంస్థలకు ఔత్సాహికులే ఊపిరి పోశారనే విషయం తెలుసా?’ అని. అప్పటినుంచి సత్య నాదెళ్ల ఆలోచనాధోరణి మారిందట.

ట్రై..అండ్...ట్రై!
ఓ తొమ్మిదేళ్ల అంధ బాలుడు తండ్రితో తనకు బేస్‌బాల్ ఆడాలని ఉందంటూ గోలపెట్టాడు. దానికి ఆ తండ్రి ‘నువ్వు గుడ్డివాడివి. ఎలా ఆడగలుగుతావు’ అంటూ నిరుత్సాహపరచకుండా ‘ముందు బంతి చేతిలోకి తీసుకో. ఆడటం మొదలుపెట్టకుండా ఆట గురించి తెలుసుకోలేవు’ అన్నాడు.

జీవితాంతం ఉండాలి..
కృతజ్ఞతాభావం!
అగ్ని మాపక శాఖ కార్యాలయంలో పనిచేసుకుంటున్న ఓ ఉద్యోగిని రోడ్డుపై వెడుతున్న ఓ మహిళ చూసి, వెంటనే లోపలికి వచ్చి, కన్నీళ్లతో నమస్కరించిందట. ‘ఏవిటమ్మా...ఏమైంది?’ అని అతనడిగితే ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయినప్పుడు నన్ను కాపాడింది మీరే’నంటూ కృతజ్ఞతలు తెలుపుకుందట.

కష్టాల్నీ పంచుకోవాలి!
కరవు కాటకాలతో అల్లాడుతున్న కెన్యాలో ఓ వ్యక్తికి జింబాబ్వేనుంచి వలస వచ్చిన మరో వ్యక్తి తారసపడ్డాడు. బక్కచిక్కిన శరీరంతో ఉన్న ఆ వ్యక్తి.. మూడు రోజులనుంచీ తాను ఏమీ తినలేదనీ, తినడానికి ఏమైనా పెట్టమనీ ప్రాధేయపడ్డాడు. చలించిపోయిన మొదటి వ్యక్తి...తాను తింటున్న రొట్టెముక్కను అతనికి ఇచ్చాడు. అయితే అతను.. ‘మొత్తమంతా నాకొద్దు. చెరి సగం తిందాం’ అంటూ సగం రొట్టెముక్కను వెనక్కిచ్చాడట.