యువ

ఈ బరువులు మాకొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ బ్యాగ్‌లపై ఇద్దరు చిన్నారుల పోరాటం
పుస్తకాల సంచులు మోయలేక పిల్లల్లో నడుము నొప్పి, గూని వస్తున్నాయి,
-‘అసోచామ్’ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిన నిజం.
అయితే సర్వేలు ఘోషిస్తున్నా, కోర్టులు శాసిస్తున్నా వ్యవస్థలో మాత్రం మార్పు రావడం లేదు. కానీ, పనె్నండేళ్ల వయసున్న ఇద్దరు కుర్రాళ్లు ఈ విషయంలో చేసిన పోరాట ఫలితంగా కాస్త కదలిక వచ్చింది. కనీసం తాము చదువుతున్న పాఠశాలలోనైనా పుస్తకాలు దాచుకునేందుకు లాకర్లు పెట్టించగలిగారు.
మహారాష్టల్రోని చంద్రాపూర్‌లో విద్యా నికేతన్ అనే ఓ పెద్ద పాఠశాల ఉంది. ఉన్నట్టుండి ఈ పాఠశాల యాజమాన్యం తమ స్కూల్‌లో చదువుకుంటున్న చిన్నారుల అందరూ తమ పుస్తకాల సంచుల్ని పెట్టుకునేందుకు లాకర్లు ఏర్పాటు చేసింది. అయితే...ఇది ఒక్క రోజులో జరిగిన పరిణామం కాదు. దీని వెనుక ఏడో తరగతి చదువుతున్న ముక్కుపచ్చలారని ఇద్దరు కుర్రాళ్ల పోరాటం ఉంది. వారి పేర్లు రుగ్వేద్, పారితోష్ ధండేకర్. వీళ్లు చదువుతున్న ఏడో తరగతి క్లాసులు మూడో ఫ్లోర్‌లో జరుగుతాయి. రోజూ ఏడెనిమిది కిలోల బరువున్న పుస్తకాల సంచుల్ని మోయలేక ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆయన పట్టించుకోలేదు. ఏకంగా రాష్ట్ర విద్యా మంత్రికే ఫోన్ చేశారు. ఆయన సెక్రటరీ ఈ ఫోన్‌కాల్‌ను మంత్రివరకూ వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఇలా వీల్లేదనుకుని, ఇద్దరు చిన్నారులూ కలసి నేరుగా ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న జర్నలిస్టులకు సమస్య వివరించి, ప్రెస్‌మీట్ పెట్టేశారు. ఇంకేముంది? పాఠశాల యాజమాన్యం కదిలింది. ఈ వివాదం చినికి చినికి గాలివాన కాకముందే లాకర్లు ఏర్పాటు చేసింది.
అయితే ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపేది లేదంటున్నాడు రుగ్వేద్. జాతీయ స్థాయిలో అన్ని స్కూళ్లలోనూ లాకర్లు ఏర్పాటు చేసేదాకా తమ పోరాటం ఆగదంటున్నాడు. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు తెగువ చూపించిన ఈ చిన్నారులపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.

chitram.. విలేఖరుల సమావేశంలో తాము మోస్తున్న పుస్తకాల బరువు గురించి
వివరిస్తున్న రుగ్వేద్, పారితోశ్ ధండేకర్