యువ

సైక్లిస్టులకూ ఓ ఎయిర్‌బ్యాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హై ఎండ్ కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఏదైనా ప్రమాదం జరిగితే, మరుక్షణంలో ఈ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుని, కారులో ఉన్నవారు గాయాలబారిన పడకుండా అడ్డుకుంటాయి. ఇప్పటివరకూ అయితే ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు కార్లకే పరిమితం. కానీ ఏదైనా పెద్ద వాహనం వచ్చి, సైక్లిస్టునో, స్కూటరిస్టునో ఢీకొంటే వారికి దిక్కేమిటి? సరిగ్గా ఇదే ఆలోచన హోవ్డింగ్ అనే కంపెనీకి వచ్చింది. వెంటనే తన ఆలోచనలకు పదును పెట్టి, సైక్లిస్టులకోసం ఓ ఎయిర్‌బ్యాగ్‌ను తయారుచేసింది. సైక్లిస్టులు దీనిని మెడకు తగిలించుకోవాలి. ఇందులో ఉండే అత్యాధునిక సెన్సర్లు చుట్టుపక్కల రాకపోకలు జరిపే వాహనాలపై ఓ కనే్నసి ఉంచుతాయి. సైకిల్ కదలికలను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. అనుకోని అవాంతరం జరగబోతోందని పసిగడితే వెంటనే ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంటుంది. ఈ ఎయిర్‌బ్యాగ్‌లో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి కాలర్. ఇది...వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో పటిష్టంగా ఉంటుంది. ఇది మెడకు రక్షణ. రెండోది కవర్. ఇది తెల్లగా, పటిష్టంగా ఉంటుంది. ఇది పడగలా తలపైకి లేచి రక్షణగా నిలబడుతుంది. కళ్లను మాత్రం కవర్ చేయదు. సైక్లిస్ట్‌ను ఏదైనా వాహనం ఢీకొన్నా, తలకు రక్షణ కల్పిస్తుంది ఈ ఎయిర్ బ్యాగ్. ఈ ఎయిర్‌బ్యాగ్ వచ్చే ఏడాది మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.