యువ

బాబోయ్...రోబోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ...రెండువైపులా పదునున్న ఓ ఆయుధం. మంచైనా, చెడైనా దీనితో సాధ్యమే. రోబోలు వస్తున్నాయి...మానవ జీవితంలో భాగమవుతున్నాయని సంబర పడినన్ని రోజులు పట్టలేదు...వాటి వల్ల వినాశం తప్పదని తెలుసుకోవడానికి.
అసలు సంగతేమిటంటే...2040 నాటికి మనుషులు చేసే నేరాల కంటే, రోబోలు పాల్పడే నేరాల సంఖ్యే ఎక్కువవుతుందట. అమెరికాలోని ఫ్యూచర్ లేబరేటరీకి చెందిన ట్రేసీ ఫాలోస్ అంచనా ప్రకారం రోబోలు, డ్రోన్లు, స్వయంచోదక కార్లు వంటివి ఉగ్రవాదుల చేతుల్లో ఆయుధాలుగా మారే అవకాశాలే ఎక్కువ. పేరొందిన కంపెనీలకు భవిష్యత్తు ప్రణాళికలు రచించే కీలకమైన పదవిలో ఉన్న ట్రేసీ...్ఫ్యచర్ లేబరేటరీలో ఛీఫ్ స్ట్రాటజీ, ఇన్నొవేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తమ సంస్థలో పనిచేసే శాస్తవ్రేత్తలు, నిపుణులు వ్యక్తం చేసిన భయాందోళనలు కూడా ఇవేనని ట్రేసీ అంటున్నారు.రోబోలు క్రమంగా మానవ జీవితంలో భాగమవుతున్నాయి. పెప్పర్ వంటి రోబోలు ఒంటరిగా జీవించేవారికి తోడూనీడాగా ఉంటున్నాయి. నిన్నమొన్నటి వరకూ నాలుగు గోడలకే పరిమితమైన రోబోలు, ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నాయి. కార్లు నడుపుతున్నాయి. ఆర్డర్‌పై వస్తువులు ఇంటికి తీసుకువచ్చి ఇస్తున్నాయి. వీటిని ఉగ్రవాదులు హ్యాక్ చేసి, ఆత్మాహుతి బాంబర్లుగా మారిస్తే, జరిగే నష్టం అపారంగా ఉంటుందని ట్రేసి హెచ్చరిస్తున్నారు. మరో బెడద ఏమిటంటే...ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాట్లోకి రావడంతో వీటి ఆధారంగా రోబోలు భవిష్యత్తులో నేర ప్రణాళికను స్వయంగా రూపొందించుకునే వెసులుబాటు వస్తుందని, అది మరింత ప్రమాదకరమని ట్రేసీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్‌లెస్ కార్లు, డ్రోన్లు కూడా ఇదే కోవకు చెందుతాయని, వాటిని హ్యాక్ చేయడం, రీ ప్రోగ్రామింగ్ చేసి హింసాత్మక చర్యలకు ఉపయోగించుకోవడం భవిష్యత్తులో అసాధ్యమేమీ కాబోదని ట్రేసీ అంచనా వేస్తున్నారు.