యువ

మంచి మిత్రులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాయిగా సాగిపోతున్న వారి స్కూల్ జీవితంలో మిత్రుని అకాల మరణం తీవ్ర మనోవేదన మిగిల్చింది. అంతవరకూ చదువు, స్నేహం ఈ రెండే జీవితమన్నట్లు గడిపిన ఆ మిత్రబృందం తమలో ఒకరు ఇక లేరన్న బాధ, అందరూ కలిసి ఉన్నా అంతా ఒంటరన్న భావనలోకి చేరారు. అలా కొన్నాళ్లు గడిచాక మళ్లీ చదువు ధ్యాసలో పడినా, కోల్పోయిన మిత్రుని కోసం ఏదైనా చేయాలన్న తపన వారిలో మొదలైంది. ఈలోగా స్కూల్ దశ నుంచి కళాశాలకు మారింది జీవితం. ఇంటర్ అయ్యాక డిగ్రీలో కొందరు, ఇంజనీరింగ్‌లో కొందరు చేరారు. అప్పుడే వారిలో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. మూడేళ్ల కిందట కోల్పోయిన ప్రియ మిత్రుడు ఎంవిఎస్ హేమంత్ జ్ఞాపకాలు చిరకాలం ఉండాలన్న లక్ష్యంతో ఆ మిత్ర బృందం ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. అదే ‘లివ్ ఎంవిఎస్ హెల్పింగ్ ఆర్గనైజేషన్’. ఇంజనీరింగ్ చదువుతున్న బి శ్రీహర్ష నేతృత్వంలో ప్రశాంత్, శే్వత, అరవింద్, మనోజ్, వినయ్, వెంకటేష్, శ్రుతి, లత ఈ తొమ్మిది మంది కలసి ఈ స్వచ్ఛంద సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. చదువుతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ్భారత్ పిలుపుతో మొదటి ప్రాధాన్యం ఈ అంశానికే ఇస్తూ నెలలో మూడు ఆదివారాలు విజయనగరం, పరిసర ప్రాంతాల్లో ‘క్లీన్‌లీనెస్ ఈజ్ నెక్స్ట్ టూ గాడ్లీనెస్’ అనే నినాదంతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా జూన్‌లో మిత్రుని వర్ధంతి సందర్భంగా తమకు తోచిన రీతిలో సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఒకపక్క చదువు కోసం పెడుతున్న ఖర్చులోనే వీరితో జతకూడిన మరి కొంతమంది యువకులు, తల్లిదండ్రుల సహకారంతో నెలకు 15వేల రూపాయల వరకు సమకూర్చుకుని పేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, కాలనీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ‘మా వంతు సహాయం-మీ వంతు సహకారం’ నినాదంతో ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కలసి ఆసుపత్రుల్లో రోగులకు సాయమందిస్తున్నారు. ఈ నెలలో విజయనగరం పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి వారిని ఉత్తేజపరుస్తూ స్థానిక దాతల సాయంతో ఉచితరీతిన బహుమతులు అందించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం మారుమూల గిరిజన గ్రామమైన దేవుపల్లిలోని 20 మంది గిరిజనులకు ఈమధ్యే దుస్తులు, మందులు, ఇతర సామగ్రి అందజేసి తమ సేవా నిరతిని చాటుకున్నారు. మొదటి కొద్దిమందితో ప్రారంభమైన లివ్ ఎంవిఎస్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మెచ్చకుని వివిధ కళాశాలల నుంచి ఒక్కొక్కరు వచ్చి వీరితో జత కలుస్తున్నారు. భవిష్యత్‌లో స్థిరపడ్డాక మరింత ఉన్నత లక్ష్యంతో సామాజిక సేవకు కృషి చేస్తామని సంస్థ అధ్యక్షుడైన శ్రీహర్ష చెప్పాడు. ఈ యువత లక్ష్యానికి మరింతమంది యువకులు జతకలిస్తే తమతమ ప్రాంతాల పరిధిలో కొన్నైనా మంచి పనులు జరుగుతాయి కదా!

చిత్రం.. విజయనగరం జిల్లా దేవుపల్లిలో గిరిజనులతో లివ్ ఎంవిఎస్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ సభ్యులు