యువ

చూపుడువేలితో నడిపేయొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విండోస్ ఉండవు...డోర్లు ఉండవు...అద్దాలు ఉండవు... ఆపై టాప్‌లెస్- ఇవన్నీ ఓ సూపర్ కార్ ఫీచర్లు! ఏవీ లేకపోతే అది కారెలా అవుతుందనేగా మీ సందేహం? బిఎండబ్ల్యు సిరీస్‌లో తాజాగా వస్తున్న.. కాదు, ఊరిస్తున్న ఐ విజన్ కారు గురించి వింటే ఈ సందేహం రాక మానదు. కానీ చూస్తే మాత్రం అది కారేనని ఒప్పుకుని తీరాలి. ఈ కారు గురించి కొంతకాలంగా వింటూ వచ్చిన అనేకమంది దీనిని కళ్లారా చూసేందుకు లాస్‌వేగాస్‌లో ఇటీవల జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్ షోకు తరలివచ్చారు. దీన్ని చూసి, ఇందులో ఉన్న ఫీచర్ల గురించి విని ఆశ్చర్యపోయారు. అంతలా ఆశ్చర్యపడిపోయే సంగతులు ఇందులో ఏం ఉన్నాయనేగా మీ సందేహం? అయితే చూ డండి మరి! విజన్ ఫ్యూచర్ టెక్నాలజీని అందిపుచ్చుకుని రూపొందించిన ఈ కారు వింతల్లోకెల్లా వింత. ఏమీ లేనట్టే ఉంటాయి కానీ అన్నీ ఉంటాయి. ఎయిర్ టచ్ టెక్నాలజీతో రూపొందిన మొట్టమొదటి కారిది. కేవలం చూపుడు వేలుతో దీన్ని నడిపేయొచ్చు. డాష్‌బోర్డుపైన 21 అంగుళాల భారీ డిస్‌ప్లే పానెల్ ఉంటుంది. దీని సహాయంతో ఫింగర్ టచ్‌తో కారును నడుపుతారన్నమాట. నావిగేషన్, కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కేవలం చూపుడువేలుతో సాయంతోనే జరిగిపోతాయి. (వాయిస్‌తోనైనా కమాండ్స్ ఇవ్వొచ్చు). టచ్ స్క్రీన్ టెక్నాలజీ అన్నంతమాత్రాన స్క్రీన్‌ను తాకి కమాండ్స్ ఇవ్వాల్సిన పని లేదు. వేలి సైగలతోనే కారును ముందుకు దూకించవచ్చట. కారుకు ఇరువైపులా గ్లాస్‌షీల్డ్స్ ఉండాల్సిన చోట, వెనుకవైపున మూడు శక్తిమంతమైన కెమెరాలు ఉంటాయి. ఇవి ట్రాఫిక్‌ను అనుక్షణం డిస్‌ప్లే పానెల్‌పై మన కళ్లకు కడుతూ ఉంటాయి. వాస్తవానికి టచ్ స్క్రీన్ టెక్నాలజీలో ఓ కమాండ్ ఇచ్చేందుకు అనేక స్టెప్స్ ఉంటాయి. ఎయిర్‌టచ్ టెక్నాలజీలో ఇన్ని స్టెప్స్ అక్కర్లేదు. ఉదాహరణకు నావిగేషన్ మోడ్‌లో ఓ అడ్రస్‌ను టైప్ చేయాలనుకుంటే..నాలుగక్షరాలు టైప్ చేయగానే మనకు ఏం కావాలో డిస్‌ప్లే చేస్తుంది. రోడ్డు తీరుతెన్నులను బట్టి ఎప్పటికప్పుడు వార్నింగ్ సిగ్నల్స్ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. కొసమెరుపు ఏంటంటే.. ఇంత హైఎండ్ టెక్నాలజీతో రూపొందిన కారుకు అమెరికాలో నడిపేందుకు పర్మిషన్ లేదు. ఎందుకంటారా? అక్కడి నేషనల్ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ప్రకారం ఏ కారుకైనా రియర్ వ్యూ మిర్రర్స్ తప్పనిసరి. మరి బిఎండబ్ల్యు ఐ విజన్ కానె్సప్ట్‌కు కారుకు అవి లేవుగా!