యువ

అందరికీ కావాలి గుడ్‌మార్నింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొద్దునే్న లేవకపోతే పోయేదేం లేదు...
ముచ్చటైన సూర్యోదయాన్ని చూసే అవకాశం తప్ప!
పొద్దునే్న లేవకపోతే పోయేదేం లేదు...
కాస్తంత ప్రశాంతత తప్ప!
పొద్దునే్న లేవకపోతే పోయేదేం లేదు...
శరీరానికి కావలసిన వ్యాయామం తప్ప!
పొద్దునే్న లేవకపోతే పోయేదేం లేదు...
దైనందిన ప్రణాళికను రూపొందించుకోవడం తప్ప!
-ఈ మాటలంటున్నది ఎవరో కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు,
గొప్ప గొప్ప బిజినెస్ టైకూన్లు. వారంతా సూర్యుడు పొద్దు పొడవక ముందే లేస్తారు...చకచకా పనులు కానిస్తారు. కొందరు జిమ్‌లోకి వెళ్లి, వ్యాయామం చేస్తే, మరికొందరు పేపర్లు ముందేసుకుని కూర్చుంటారు. ఇంకొందరు ఆఫీసు పనిలో తలమునకలైపోతారు. అందరూ ముక్తకంఠంతో చెప్పే మాట ఏమిటంటే- ఉదయమే లేవడం వల్ల ఆ రోజంతా మన చేతిలో ఉంటుందంటారు. వారి జీవన విధానాన్ని చూసి ఎంతైనా నేర్చుకోవచ్చు. బారెడు పొద్దెక్కేదాకా మంచం దిగని బద్ధకిస్టులకు నిజంగా ఇది కనువిప్పే కావాలి.

ప్రధాని నరేంద్ర మోదీ దినచర్య ఉదయం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది. ఆయన ఎక్కువసేపు యోగాలో గడుపుతారు. ప్రాణాయామం, సూర్య నమస్కారాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీనివల్ల రోజంతా చురుగ్గా ఉండగలుగుతామని, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని ఆయన పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకర్‌బెర్గ్ ఉదయం ఆరింటికే తయారై ఆఫీసుకు వెళ్లిపోతారు. ఆయన చాలా తక్కువసేపు నిద్ర పోతారు. అప్పుడప్పుడు తెల్లవార్లూ పనిచేయడం ఆయన నైజం.
రిలయన్స్ అంబానీ అధినేత ముకేశ్ అంబానీ ఐదు-ఐదున్నర మధ్య నిద్ర లేస్తారు. ఆయన స్వగృహంలోని రెండో ఫ్లోర్‌లో ఉన్న జిమ్‌కు వెళ్లి కాసేపు వ్యాయామం చేస్తారు. స్విమ్మింగ్ కూడా చేస్తారు. పత్రికా పఠనం కూడా పూర్తి చేశాక, కార్యాలయానికి బయల్దేరి వెడతారు.

యాపిల్ సిఇఓ టిమ్ కుక్ పొద్దున 4.30 గంటలకే నిద్ర లేస్తారు. లేచీ లేవగానే మెయిల్స్ చెక్ చేసుకుంటారు. ఆదేశాలివ్వడమంతా ఇమెయిల్స్‌లోనే జరిగిపోతాయి. ఐదు గంటలకల్లా జిమ్‌కు వెడతారు. వ్యాయామం పూర్తి చేసుకుని నేరుగా ఆఫీస్‌కు వెళ్లిపోతారు. ప్రతి రోజూ యాపిల్ ఆఫీసులో అడుగుపెట్టే మొట్టమొదటి ఉద్యోగి ఆయనే.