యువ

అంచనాలను మించి సంచలనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఇఎస్...కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో. ఏటా జరిగే ఈ షోలో ప్రపంచంలోని ఎలక్ట్రానిక్ దిగ్గజాలంతా తమ ప్రోడక్ట్స్‌ను ప్రదర్శించడం మామూలే. లాస్‌వేగాస్‌లో ఇటీవలే ముగిసిన సిఇఎస్ కూడా ఇందుకు భిన్నం కాదు. స్మార్ట్ ఫ్రిజ్‌లు మొదలు 8కె టివీల వరకూ అన్నిటినీ ఇక్కడ ప్రదర్శించారు. అయితే కొన్ని లాప్‌టాప్స్...మరికొన్ని హేండ్‌సెట్స్..ఇంకొన్ని గాడ్జెట్స్ సందర్శకుల్ని కట్టిపడేశాయి. వీటిలో చాలావరకూ సరికొత్త ఆవిష్కరణలే. చూడటానికి బాగానే ఉన్నా, ఇవన్నీ ఇండియాలో దొరుకుతాయా అన్నదే చాలామంది ప్రశ్న. దీనికి అవుననేదే సమాధానం. సిఇఎస్‌లో ప్రదర్శించిన రకరకాల గాడ్జెట్స్ అన్నీ ఇండియాలోకీ త్వరలో రాబోతున్నాయి. ఇంతకీ సిఇఎస్‌లో అందర్నీ ఆకట్టుకున్న ఆ గాడ్జెట్స్ ఏమిటో చూద్దాం.

ఆల్ ఇన్ వన్ లాప్‌టాప్
ఇంట్లో డెస్క్‌టాప్ ఉన్నా అది బెడ్‌రూమ్‌లోకి రాదు. కాబట్టి లాప్‌టాప్ తప్పనిసరి. ఇకపోతే పిల్లలకు టాబ్ కావాలి. ఇవన్నీ కొనాలంటే బోలెడు ఖర్చు. ఇలా ఆలోచించేవారికి ఓ శుభవార్త. ప్రముఖ కంప్యూటర్ పెరిఫెరల్స్ తయారీ సంస్థ ఆసస్.. సిఇఎస్‌లో ప్రదర్శించిన కొత్త రకం లాప్‌టాప్‌ను కొంటే ఇక డెస్క్‌టాప్, టాబ్‌తో అవసరం లేనట్టే. అవును మరి! దేనికి కావాలంటే దానికి ఇట్టే మారిపోయే అవకాశం ఉన్న లాప్‌టాప్‌ను ఆసస్ తయారు చేసింది. సిఇఎస్‌లో ఈ కన్వర్టబుల్ లాప్‌టాప్‌ను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారట. లాప్‌టాప్‌ను టేబుల్‌మీద ఉంచి, స్క్రీన్‌ను పైకి ఎత్తితే అది డెస్క్‌టాప్. కీప్యాడ్‌ను పూర్తిగా వెనక్కి మడిచేస్తే అది టాబ్. ఈ కోవకు చెందిన రెండు రకాల లాప్‌టాప్స్ (జ్ప్య ఱ్య్యరీ జఔ -301, -510)ను ఆసస్ త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఈ లాప్‌టాప్స్ విండోస్ 10పై రన్ అవుతాయి.
కుక్కలకోసం ఓ వీడియోగేమ్!
ఇంట్లో ఓ చిన్న కుక్కపిల్ల ఉంటే భలే బావుంటుంది! కావలసినంత కాలక్షేపం. అయితే అది కొంతవరకే. రోజులు గడిచిన కొద్దీ చాలామంది విషయంలో అదో తలనొప్పిగా పరిణమిస్తుంది. రోజూ దానిని బయటకు తీసుకువెళ్లడం, ఆడించడం, తినిపించడం వంటివి బోరింగ్‌గా మారతాయి. అలాంటివారికోసం మార్కెట్లోకి వచ్చిందే -క్లెవర్ పెట్. ఈ గాడ్జెట్ ఇంట్లో ఉంటే కుక్కను ఇక మీరు ఆడించక్కర్లేదు. ఇంతకీ క్లెవర్ పెట్ ఏవిటంటే- ఓ రకంగా ఇదో వీడియో గే మ్ అన్నమాట. వీడియోగేమ్ అనగానే వైఫైలు, ప్రాబ్లెమ్ సాల్వింగ్ వం టివి ఆలోచించకండి. కుక్క కదా ఇవన్నీ ఎలా చేస్తుంది? ఫొటోలో చూ డండి...క్లెవర్‌పాట్ అనేది బోర్లించిన గినె్నలా ఉంటుంది. దీనిముందు మూడు లైట్లు ఉంటాయి. కుక్క దీని దగ్గరగా వెడితే లైట్లు వెలిగుతాయి. దేనినైనా కాలితో తాకితే లోపలినుంచి ఓ చిన్న డాగ్ బిస్కెట్ వస్తుంది. అంతే...దాని నోటితో తీసుకుంటుంది. మళ్లీ వెడితే మళ్లీ అదే ప్రొసీజర్. ఇప్పుడీ క్లెవర్‌పెట్‌కు డిమాండ్ బాగుందని దీని రూపకర్త డాన్ నడ్సన్ చెబుతున్నారు. సిఇఎస్‌లో క్లెవర్‌పెట్ పట్ల అనేకమంది ఆసక్తి కనబరిచారని కూడా చెబుతున్నాడు.
గాల్లో తేలినట్టుందే!
ఇ-హాంగ్ ఓ మినీ హెలికాప్టర్
డ్రోన్‌కు పెద్దన్న ఒకటి సిఇఎస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏంటా పెద్దన్న అనేగా మీ సందేహం? చైనాకు చెందిన గుయాంగ్‌ఝా అనే డ్రోన్ల తయారీ కంపెనీ... ఇ హాంగ్ 184 ఏఏవి పేరిట పెద్ద డ్రోన్‌ను తయారు చేసింది. అయితే పేరుకే ఇది డ్రోన్...చూస్తే మాత్రం ఓ హెలికాప్టర్‌ను తలపిస్తుంది. పైగా దీనిని మానవ రహిత డ్రోన్ అనేందుకు వీల్లేదు. ఎందుకంటే ఇందులో ఒకరు కూర్చుని ప్రయాణించొచ్చట. ఎనిమిది బ్లేడ్ల సాయంతో శక్తిమంతమైన బ్యాటరీతో ఇది గాల్లో ఎగురుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 23 నిమిషాలు ఎగిరే సామర్థ్యముందట. ఇ హాంగ్ 184 ధర మాత్రం మూడు లక్షల డాలర్ల పై చిలుకేనంటున్నారు!
*

ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్
ఫ్రిజ్‌లో ఏముందో చూడాలంటే డోర్ తెరవాల్సిందే కదా! కానీ శామ్‌సంగ్ తాజా ఆవిష్కరణ- ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్‌కు ఆ అవసరం లేదు. కేవలం ఫింగర్ టచ్‌తో ఫ్రిజ్‌లో ఏమున్నాయో తెలుసుకోవచ్చు. ఫ్రిజ్ లోపల అమర్చిన ఇంటీరియర్ కెమెరాద్వారా లోపల ఉన్నవన్నీ డిస్‌ప్లే అవుతాయన్నమాట. 21.5 అంగుళాల ఈ భారీ ఫ్రిజ్ పూర్తిస్థాయి స్మార్ట్ ఫ్రిజ్. పూర్తిస్థాయి హెచ్‌డి మానిటర్, స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లతో సిఇఎస్‌లో సందర్శకుల్ని కట్టిపడేసింది మరి. ఇతర స్మార్ట్ హోమ్ డివైస్‌లతో దీన్ని కంట్రోల్ చేయొచ్చు కూడా. శామ్‌సంగ్ దీని రేటెంతో ఇంకా చెప్పలేదు. అలాగే మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొచ్చేదీ కూడా పెదవి విప్పడం లేదు.