యువ

క్షేమంగా వెళ్లి... లాభంగా తెస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్, తన సరకులను డ్రోన్ల ద్వారా చేరవేయాలన్న ఆలోచన ఇంకా కార్యరూపం ధరించకముందే, ఓ స్టార్టప్ కంపెనీ ఆ దిశగా ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన హైలియో సంస్థ పెగాసస్ అనే డ్రోన్‌ను రూపొందించింది. 2.5 కేజీల బరువును మోయగలిగే పెగాసస్ ఏకధాటిన 35 నిమిషాలసేపు గాలిలో ఎగరగలుగుతుంది. 6.4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. తేలికపాటి వస్తువులను మోసుకెళ్లేందుకు వీలుగా పెగస్‌స్‌కు ఆరు మోటార్లు అమర్చారు. జిపిఎస్ నావిగేటింగ్ వ్యవస్థ ఆధారంగా ప్రయాణించే పెగాసస్‌కు స్మార్ట్ఫోన్‌లోని యాప్ ద్వారా దిశానిర్దేశం చేయొచ్చట. ప్రయోగ దశ దాటి, మార్కెట్‌లోకి రాబోతున్న పెగాసస్ ఓ తాజా సంచలనమనే చెప్పాలి. అయితే డ్రోన్లకు సంబంధించి విమానయాన నిబంధనలు మారుతూండటం వల్ల ఎక్కడబడితే అక్కడ ఇలాంటి డ్రోన్లను వినియోగించే పరిస్థితి లేదు. అమెరికాలో ఇప్పుడిప్పుడే ఈ దిశగా నిబంధనలను సడలిస్తున్నారు. పెగాసస్ డ్రోన్‌ను వెయ్యి డాలర్లకు అమ్మేందుకు హైలియో సంస్థ సన్నాహాలు చేస్తోంది.