యువ

వెర్టిగో... ఓ బుల్లి సినిమా కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిల్మ్ మేకింగ్!
యూత్‌కు కిర్రెక్కిస్తున్న ప్రొఫెషన్‌లలో ఇదీ ఒకటి.
అంతకుమించి సినిమా అనేది ఓ పవర్‌ఫుల్ మీడియా.
ఈ రంగంలో యువతను ఎంకరేజ్ చేసి, వారిలో దాగున్న ప్రతిభాపాటవాలను వెలికితీసేందుకు ఆవిర్భవించిందే ‘ఇండియా ఫిల్మ్ ప్రాజెక్ట్ (ఐఎఫ్)’. షార్ట్ ఫిల్మ్ తీసే వారిని ఎంకరేజ్ చేసి, వారికో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సినిమా అనగానే తీరిగ్గా కూర్చుని, స్క్రిప్ట్ రెడీ చేసుకుని, నెమ్మదిగా నటీనటవర్గాన్ని ఎంపిక చేసుకుని, ఆనక షూటింగ్ చేసే రొటీన్ పద్ధతికి ఇది భిన్నం. ఈ కాంపిటీషన్‌లో పాల్గొనేవారికి ఐఎఫ్‌పి కేవలం 50 గంటలే గడువిస్తుంది. ఈ 50 గంటల్లోనే అంతా అయిపోవాలి. ఇలా తీసిన సినిమా లేదా షార్ట్ఫిల్మ్‌ను పేరొందిన డైరక్టర్లు పరిశీలించి, అవార్డులకు ఎంపిక చేస్తారు. ఈసారి అలా ఎంపికై, ఐదో స్థానం పొందిన ‘వెర్టిగో’ షార్ట్ఫిల్మ్‌ను తీసింది మన హైదరాబాద్ కుర్రకారే కావడం విశేషం.
ధర్మ తేజకు సినిమాలంటే పిచ్చి. కెమెరా అంటే మరీ పిచ్చి. తన టాలెంట్ నిరూపించుకునేందుకు టాలీవుడ్‌లో కాలుపెట్టి, ‘డి ఫర్ దోపిడి’ వంటి చిన్నా చితకా సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేశాడు. వెడ్డింగ్ ఫొటోగ్రఫీలోనూ అతనికి అంతో ఇంతో పేరుంది. ‘ఇండియా ఫిల్మ్ ప్రాజెక్ట్’ ఛాలెంజ్ గురించి విన్నాక, తానంటే ఏమిటో నిరూపించుకోవాలనుకుని రంగంలోకి దిగాడు. ఓ కథ రాసుకున్నాడు. ‘టాలీవుడ్‌లో కాలుపెట్టాలనుకునే ఓ డైరెక్టర్.. కథ చేతిలో పట్టుకుని నిర్మాతల ఇంటి చుట్టూ తిరిగే’ అంశాన్ని కథగా మలచుకుని, నటీనటుల ఎంపికలో పడ్డాడు. జైదేవ్ అనే కుర్రాణ్ని తన కథకు హీరోగా తీసుకున్నాడు. మిగతా టీమ్ అంతా రెడీ అయ్యాక, నిర్ణీత గడువులోగా షూటింగ్ పూర్తి చేసి, ‘వెర్టిగో’ అనే టైటిల్‌తో ఐఎఫ్‌పికి పంపాడు. ఈ షార్ట్ ఫిల్మ్ మధుర్ బండార్కర్, నగేశ్ కుకునూర్, శ్రీరామ్ రాఘవన్ లాంటి జ్యూరీ మెంబర్లను మెప్పించి, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో వచ్చిన 23 వేల ఎంట్రీల్లో ఐదో స్థానాన్ని సంపాదించింది. ఈ విజయంతో ధర్మ తేజ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ‘నేను రిస్క్ చేసి, తీసిన ‘వెర్టిగో’కు అవార్డు రావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అవి చిన్నవే అయినా, కాదనలేనివే. టీవి కమర్షియల్స్ చేయాలంటూ కొందరు అప్రోచ్ అయ్యారు. ఓ ఇంటర్నేషనల్ చానెల్‌కు చెందిన ప్రొడ్యూసర్ ఒకరు నాతో ట్రావెల్ ప్రోగ్రామ్ చేయించాలనుకుంటున్నారు. ఓ కాఫీ బ్రాండ్ కూడా నన్ను సంప్రదించింది’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ధర్మతేజ.

చిత్రం.. ‘వెర్టిగో’ షార్ట్ ఫిల్మ్ కుర్రకారు