యువ

సహనమే విజయ సోపానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహనమే విజయ సోపానం! ఇది జగమెరిగిన సత్యం..తొందరపాటుతో అనర్థాలు ఉంటాయేమో గానీ ఓపిగ్గా ఆలోచించి..అవసరాలను బేరీజు వేసుకుని, గుణదోషాలను విశే్లషించుకుని ముందుకు వెళితే అన్ని వేళలా విజయమే వరిస్తుంది. ఈ సూత్రం అన్ని రంగాలకూ వర్తిస్తుంది. ముఖ్యంగా నేటి యువత దీన్ని మరింతగా వంటబట్టించుకోవడం ఎంతైనా అవసరం. నేటి పోటీ ప్రపంచంలో హడావుడే అందరి జీవితాలనూ శాసిస్తోంది. తీరిగ్గా ఆలోచించుకునే వ్యవధే లేకుండా చేస్తోంది..తాబేలు కుందేలు కథ మనందిరికీ తెలిసిందే. తన వేగానికి తిరుగేలేదని భావించిన కుందేలును నెమ్మదితనానికి పెట్టింది పేరైన తాబేలు ఎలా గెలిచిందో ఎన్నోసార్లు విన్నాం. ఈ కథలో నీతి అతివిశ్వాసం పనికిరాదన్నదే! మామూలుగా కుందేలు పరుగు పెట్టి ఉంటే తాబేలు ఎంతో దూరం తేడాతో ఓడిపోయి ఉండేదే. కానీ అలా జరుగలేదు కాబట్టే..అతి విశ్వాసం కంటే ఆత్మ విశ్వాసమే మిన్న అన్న సామెత పుట్టుకొచ్చింది. అంతే మనం ఏపని చేసినా అందులో నిలకడతనం ఉండాలి. ఎదో మొక్కుబడిగా ముందుకెళితే ఫలితమూ అలాగే ఉంటుంది. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో సహనశీలతకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. ఇలాంటి సమయాల్లో నెగ్గేది నెగ్గుకొచ్చేది సహనం, ఆత్మస్థయిర్యం, దుందుడుకు మనస్తత్వం లేని వ్యక్తులేనన్నది నిజం. ‘ప్రశాంతంగా ఉండు..నీ పని నువ్వు చేసుకుపో’అంటూ దశాబ్దాల క్రితం విన్‌స్టన్ చర్చిల్ చెప్పిన మాటలు నాటికే కాదు అతివేగంతో దూసుకు పోతున్న నేటి సామాజిక పరిస్థితులకూ ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో అలవరచుకోవాల్సిన లక్షణం!

-సుధ