యువ

ఆయన రూటే సెపరేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న కురిసిన కుండపోత వర్షాలకు హైదరాబాద్‌లోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. గుంతలు తేలాయి. పడుతూ లేస్తూ ప్రయాణం. నరకయాతన అంటే ఏమిటో జనానికి మరోసారి తెలిసొచ్చింది.
కట్ చేస్తే...
ఇలాంటి వర్షాలే ఇటీవల కర్నాటకలోని తొండెబావి గ్రామం చుట్టుపక్కలా పడ్డాయట. కానీ ఆ గ్రామానికి సమీపంలో నిర్మించిన ఓ రోడ్డు చెక్కుచెదరలేదట.
మరి..ఏంటా రోడ్డు ప్రత్యేకత?
బెంగళూరుకు 83 కిలోమీటర్ల దూరంలో తొండెబావి ఉంది. ఇక్కడ తాజాగా వేసిన రోడ్డు స్పెషాలిటీ ఏవిటంటే...తక్కువ ఖర్చుతో, సిమెంట్, తారు వంటివి తక్కువ పాళ్లలో వాడుతూ, ఫ్లైయాష్ ఎక్కువ మోతాదులో ఉపయోగించి నిర్మించిన రోడ్డిది. ఇక దీని మరో ప్రత్యేకత ఏంటంటే...తాజాగా వేసిన ఈ రోడ్డు ఇంకో పదిహేనేళ్ల వరకూ చెక్కుచెదరదట. పైగా రిపేర్లు వచ్చినా తనంతట తానే మరమ్మతులు చేసుకునే రోడ్డట! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజమండీ!
ఓ భారతీయుడి ఘనత!
ప్రయోగాత్మకంగా నిర్మించిన రోడ్డు వెనక ఓ ప్రవాస భారతీయుడి ప్రతిభాపాటవాలు దాగున్నాయి. ఆయన పేరు నేమ్ కుమార్ బంతియా. నాగపూర్‌కు చెందిన నేమ్ కుమార్, ఢిల్లీ ఐఐటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 34 ఏళ్ల కిందటే కెనడా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన వాంకోవర్‌లోని యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. గత నాలుగేళ్లుగా నేమ్ కుమార్ తన బృందంతో కలసి రోడ్ల నిర్మాణంపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మనగలిగే రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన నేమ్ కుమార్, తన ప్రయోగాలకు కర్నాటకలోని తొండెబావి గ్రామ సమీపంలోని రోడ్డును ఎంచుకున్నారు. గ్రామాన్ని ప్రధాన రహదారితో కలిపే రోడ్డును ఆయన ప్రయోగాత్మకంగా నిర్మించారు. మన దేశంలో మండుటెండలనూ, అతివృష్టినీ తట్టుకుని నిలబడితే ఇలాంటి రోడ్లను దేశవ్యాప్తంగా నిర్మించవచ్చన్నది ఆయన ఆలోచన. నేమ్ కుమార్ బృందం పరిశోధనలకు కెనడా-ఇండియా రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తోడ్పాటునందిస్తోంది. యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఓ విభాగంగా నడుస్తున్న ఈ రీసెర్చ్ సెంటర్ ఉభయ దేశాల్లో తక్షణ సమస్యలపై దృష్టి సారించి, వాటికి పరిష్కార మార్గాలను కనుగొంటుంది.
ఖర్చు తక్కువ..మన్నిక ఎక్కువ
నేమ్ కుమార్ బృందం నిర్మించిన రోడ్డుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రోడ్డు మందం 100 మిల్లీమీటర్లు మాత్రమే. సాధారణంగా ప్రభుత్వం వేసే రోడ్ల మందంకంటే ఇది 60 శాతం తక్కువ. మామూలు రోడ్లకు సిమెంట్‌ను ఎక్కువ ఉపయోగిస్తే, తొండెబావి గ్రామం రోడ్డుకు ఫ్లై యాప్‌ను ఎక్కువగా వినియోగించారు. దీనివల్ల నిర్మాణం ఖర్చు చాలా తగ్గింది. సిమెంట్ నిర్మాణాలనుంచి గ్రీన్ హౌస్ వాయువులు అత్యధికంగా వెలువడతాయి. ఇది పర్యావరణానికి హానికరం. అందువల్లనే ఫ్లై యాఫ్‌ను ఎంచుకున్నామంటారు నేమ్ కుమార్. సాధారణంగా రోడ్లకు పగుళ్లు ఏర్పడతాయి. వాటికి నీటిని పీల్చుకునే గుణం లేకపోవడంతో ఈ పగుళ్లు రానురాను గుంతలుగా మారతాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నేమ్ కుమార్, రోడ్డు నిర్మాణంలో నానో కోటింగ్ వేసిన ప్రత్యేకమైన ఫైబర్ (హైడ్రోఫిలిక్ నానో కోటింగ్)ను ఉపయోగించారు. హైడ్రోఫీలియా అంటే నీటిని పట్టి ఉంచే గుణం. దీనివల్ల రోడ్డుకు నీటిని పీల్చుకునే గుణం ఉంటుందట. ఈ టెక్నాలజీని ‘క్యూట్ మెకానిజమ్’గా నేమ్ కుమార్ అభివర్ణిస్తారు. పగులు ఏర్పడిన వెంటనే, లోపల ఉన్న నీటి సాయంతో వెంటనే పగులు పూడుకుపోతుంది.
నేమ్ కుమార్ వేసిన రోడ్డు గురించి తెలుసుకున్న హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పుడు ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నాయి. అలాగే భారత రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఈ టెక్నాలజీపై ఆసక్తి కనబరుస్తోందట. కేవలం ఇండియాయే కాదు..ఇతర దేశాలూ ఈ సరికొత్త టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నాయట. దీనికంతటికీ ఓ ప్రవాస భారతీయుడు కారణం కావడం...్భరతీయులంతా గర్వించదగిన అంశం...కాదంటారా?

నేమ్ కుమార్
స్వస్థలం: నాగపూర్
చదివింది: ఐఐటి ఢిల్లీలో గ్రాడ్యుయేషన్
యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (యుబిసి)
లో పిహెచ్‌డి
ఉద్యోగం: వాంకోవర్‌లో యుబిసిలోని సివిల్ ఇంజనీరింగ్
విభాగంలో
ఘనత: నిర్మాణాల్లో వాడే మెటీరియల్‌లో విప్లవాత్మకమైన
మార్పులు తీసుకురావడం
అవార్డులు: యుబిసిలో డిస్టింగ్విష్డ్ వర్శిటీ స్కాలర్ (2003)
అదే వర్శిటీలో ఇన్‌ఫ్రాస్టక్చర్ రిహాబిలిటేషన్ అండ్
సస్టెయినబిలిటీలో సీనియర్ కెనడా రీసెర్చ్ చెయిర్‌గా నియామకం
ఐసి-ఇంపాక్ట్స్ సైంటిఫిక్ డైరెక్టర్‌గా 2012లో నియామకం