యువ

ఆకలి తీర్చిన ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

150 కోట్ల జనాభాకు దగ్గరవుతున్న భారతదేశంలో
ఆకలంటే తెలియనివారు కోట్లాదిమంది ఉన్నారు.
ఆకలికి నిర్వచనంగా నిలబడిన వారూ అదే సంఖ్యలో ఉన్నారు.
ఆకాశాన్నంటే హర్మ్యాలొకవైపు, మురికి కాల్వల పక్కనే
పూరి గుడిసెలొకవైపు
వ్యవస్థలోని అసమతుల్యతకు అద్దం పట్టే
దృష్టాంతాలు మన దేశంలో కోకొల్లలు.
అన్నమో రామచంద్రా అని అలమటించే వారిని
ఆదుకోలేనంత బిజీ కొందరిది!
ఆ వైపు చూడటమే మహా పాపమన్న ధోరణి మరికొందరిది!
వెరసి ఆకలి కేకలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
జానెడు పొట్ట నింపుకోలేక
అన్నార్తులు కన్నుమూస్తూనే ఉన్నారు.
ఆకలి ఓ మహమ్మారి
మనిషి శరీరంలోకి ప్రవేశించి, క్రమంగా కబళించే
ఎయిడ్స్ వైరస్‌కంటే దారుణమైనది.

ఇలాంటి వ్యవస్థలో మార్పు తీసుకొద్దామనుకున్నాడో యువకుడు.
చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, స్నేహితుల్ని కూడగట్టి
అన్నార్తులకు అండగా నిలబడ్డాడు.
వారి ఆకలిని తీరుస్తున్నాడు.
వారి కన్నీళ్లను తుడుస్తున్నాడు.
అతని పేరు ...అంకిత్ కవాట్రా. వయసు 22 ఏళ్లు!

రెండేళ్ల కిందట అంకిత్ ఢిల్లీలో ఓ పెద్ద పార్టీకి వెళ్లాడు. దేశవిదేశాలనుంచి వచ్చిన కుక్స్ (వంటవాళ్లు) వండివారుస్తున్నారు. అప్పుడు అంకిత్‌కి ఓ అనుమానం వచ్చింది. అందరూ తినగా మిగిలిన ఆహారాన్ని ఏం చేస్తారు? అని. అదే విషయాన్ని ఓ కేటరర్‌ని పిలిచి అడిగాడు. ‘ఏం చేస్తాం?..పారేస్తాం!’ అంటూ అతను చెప్పిన జవాబు విని అంకిత్ షాకయ్యాడు. ఓ పక్కన లక్షలాది మంది తినడానికి తిండి లేక అలమటిస్తుంటే, ఇలా ఆహార పదార్థాల్ని పారేయడమేంటి? వాటిని అన్నార్తుల వద్దకు చేర్చే మార్గమెలా? అని ఆలోచించాడు. అలా అతని ఆలోచనలోంచి పుట్టిందే ‘్ఫడింగ్ ఇండియా’! ఇదో లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థ. అప్పటివరకూ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు.
తన ఆలోచనను స్నేహితులకు చెప్పి, వారిని తన సహచరులుగా చేసుకున్నాడు. వీలైనన్ని రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి, వారు పారేసే ఆహారాన్ని తమకు ఇమ్మని కోరాడు. అలా చేయడం వల్ల నష్టం లేకపోవడంతో హోటళ్ల యజమానులు అందుకు ఓకే అన్నారు. ఇక అప్పటినుంచి హోటళ్లనుంచి ఆహార పదార్థాల్ని సేకరించడం, అన్నార్తులకు చేరవేయడం అంకిత్ దినచర్యగా మారిపోయింది.
ఇప్పటివరకూ ‘్ఫడింగ్ ఇండియా’ తరపున అంకిత్ కోటీ 30 లక్షల మంది ఆకలి తీర్చినట్టు అంచనా. మరోవైపు 3.75 కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్ధాలు వృథా కాకుండా సద్వినియోగం చేశాడు.
‘ఆకలిని రూపుమాపడమే నా లక్ష్యం. భావి తరాల వారు ఆకలిని కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే చదువుకోవాలి. ఆ దిశగా నా కృషి నిరంతరం సాగుతుంది’ అంటాడు అంకిత్.

చిత్రం.. అంకిత్ కవాట్రా