యువ

‘దివ్య’మైన వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓపెన్ సిసేమ్!
అలీబాబా...40 దొంగల గురించి తెలిసిన వారికి ఈ పదాలకు అర్థం కూడా తెలిసే ఉంటుంది. దొంగల డెన్ తలుపులు తెరిచేందుకు వారు వాడే కోడ్ అది. దానినే ఉపయోగించి అలీబాబా దొంగల భరతం పడతాడు. ఇప్పుడు ఈ రెండు పదాలే దివ్యాంగుల పాలిట వరంగా మారాయి. వారికి అండా దండా తామే అయ్యాయి..
అసలు విషయంలోకి వెడితే...
లివ్‌నే ఆనే ఆయన ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఇజ్రాయెల్ నేవీ కమాండర్‌గా పనిచేస్తూ, ఓ యుద్ధంలో వెనె్నముకకు తగిలిన గాయం వల్ల శరీరంలో సగభాగం చచ్చుబడిపోయింది. తల తప్ప కాళ్లూ చేతులూ సైతం కదపలేని దీన పరిస్థితి ఆయనది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచానే్న జయించగలిగేంతటి ధీమా ఉన్న ఈ రోజుల్లో కనీసం లివ్‌నే స్మార్ట్ఫోన్ కూడా ఆపరేట్ చేయలేని దుస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఓడెడ్ బెన్ డోవ్ అనే సాఫ్ట్‌వేర్ నిపుణుడికి ఓ లెటర్ రాశాడు. తన పరిస్థితి గురించి వివరిస్తూ, నా కోసం ఓ స్మార్ట్ఫోన్ తయారు చేయగలరా? అని అడిగాడు. దానికి అవతలనుంచి సరేననే సమాధానం వచ్చింది. ఇంకేముంది? లివ్‌నె, డోవ్ కలసి సిసేమ్ ఎనేబుల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. వారి ప్రయోగాలు ఫలించాయి. 2015లో సిసేమ్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇది పూర్తిగా టచ్-ఫ్రీ ఫోన్ కావడం విశేషం. ఫోన్‌ను ముట్టుకోకుండా ఆపరేట్ చేయగలగడం ఇందులో ప్రత్యేకత. స్మార్ట్ఫోన్‌కు ఉండే ఫ్రంట్ కెమెరా ఇందులో కీలకం. ఈ కెమెరా దీనిని వాడే వ్యక్తి తల కదలికలను బట్టి పనిచేస్తుంది. తలను కదిలించడం ద్వారా కర్సర్‌ను కదిలిస్తూ, స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్ చేయొచ్చు. మెసేజ్‌లూ, ఈ మెయిల్సూ..ఒకటేమిటి, అందరూ స్మార్ట్ఫోన్‌తో ఏమేం చేయగలరో, దివ్యాంగులు కూడా వాటన్నింటినీ చేయగలరు. దీని సాయంతో లివ్‌నే మళ్లీ బిజినెస్‌లో బిజీ అయ్యారు.
వాస్తవానికి సిసేమ్ సంస్థ సిసేమ్ ఎనేబుల్ యాప్‌ను నెక్సస్ 5 స్మార్ట్ఫోన్‌తో కలిపి 1200 డాలర్లకు విక్రయిస్తోంది. (ఈ ఫోన్ గురించి, ఆపరేట్ చేసే విధానం గురించి sesame-enable.comలో వివరాలు ఉన్నాయి) ఇంత ధర పెట్టి కొనలేని దివ్యాంగులూ ఉన్నారు. వీరికోసం ఓపెన్ సిసేమ్ యాప్ (్open sesame app)ను రూపొందించారు. ఇటీవలే గూగుల్...సిసేమ్ యాప్‌కు అనుగుణంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్‌ను తీర్చిదిద్దడంతో ఆండ్రాయిడ్ 7.0 సాఫ్ట్‌వేర్ ఉన్న అన్ని స్మార్ట్ఫోన్లపైనా ఈ యాప్‌ను వినియోగించే వెసులుబాటు ఏర్పడింది.
దివ్యాంగుల అవసరాలను తీరుస్తున్న ఓ అరుదైన ఫోన్‌ను కనుగొన్నానన్న సంతృప్తి ఈ జన్మకు చాలంటాడు లివ్‌నే.

కొత్త జీవితాలు!
లివ్‌నే వంటి దివ్యాంగులకు సిసేమ్ యాప్ ఇప్పుడో వరంగా మారింది. అమియోట్రోఫిక్ లాటరల్ స్కెలరోసిస్ అనే మహమ్మారి వ్యాధితో బాధపడే రోనీ మొరాన్ (ఇజ్రాయెల్)కు ఈ ఫోన్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఇటీవలే మరణించిన రోనీ, గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసిన ఓ వీడియోలో ఈ యాప్‌ను ఎంతో ప్రశంసించారు. స్పైనల్ మజిల్ అట్రోఫీతో బాధపడుతున్న ఫ్రిడ్‌మాన్‌కు కూడా సిసేమ్ యాప్ కొండంత అండగా నిలబడుతోంది. ‘డిజేబుల్డ్, నాట్ హాఫ్ ఏ పర్సన్’ పేరిట దివ్యాంగుల హక్కులకోసం పోరాడుతున్న ఫ్రిడ్‌మాన్, ఈ యాప్ ద్వారా తన కార్యక్రమాలను కొనసాగించగలుగుతున్నారు.

చిత్రం.. టచ్ ఫ్రీ సిసేమ్ ఫోన్‌తో లివేనే