యువ

అబ్బురం... అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. మొబైల్ ఫోన్ వెలుగుజూసిన రెండున్నర దశాబ్దాల్లో టెక్నాలజీ మానవ జీవితంపై చూపిన ప్రభావం మాటల్లో వర్ణించలేనిది. ఒకప్పుడు బ్యాంక్ ఖాతాలోంచి డబ్బు డ్రా చేయాలన్నా గంటల కొద్దీ క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి. మరోచోటికి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయాలంటే చెక్కులో, మనీయార్డర్లో గతి. ఏ చిన్న వస్తువును కొనాలన్నా మార్కెట్‌కు పరుగెత్తాల్సి వచ్చేది. దూరప్రాంతంలో ఉన్న వారితో మాట్లాడాలంటే టెలిఫోనే దిక్కు. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాలంటే రోజులు పట్టేది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని ఇప్పుడు ఇవన్నీ ఒక్క క్లిక్ దూరంలోకి వచ్చేశాయి. టెక్నాలజీలో పరిశోధనలు కొనసాగుతున్నంతకాలం సరికొత్త ఆవిష్కరణలు వెలుగుచూసి, మనల్ని ఆశ్చర్యానందాలకు లోను చేస్తూనే ఉంటాయి. ఈ కోవలో గత ఏడాది కూడా ఔరా అనిపించే అద్భుతమైన ఆవిష్కరణలు ఎన్నో వెలుగుచూశాయి. ఇవన్నీ మానవ జీవన విధానాన్ని మరింత సరళతరం చేసేవే. ప్రగతిని మరింత ముందుకు తీసుకుపోయేవే. అలాంటి ఐదు ఆవిష్కరణలు ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం.