యువ

ఓ తీపి జ్ఞాపకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికిత్స పూర్తి చేసుకుని, ఆరోగ్యంతో ఇంటికి వెళ్లే చిన్నారులను చూస్తే తన జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటానని పూర్ణొతా అంటారు. చిన్నారుల కళ్లలో వెలుగు దివ్వెలు పూయిస్తున్న కడిల్స్ ఫౌండేషన్ ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్నో తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుంది. అలాంటి ఓ మరచిపోలేని అనుభూతి గురించి పూర్ణొతా వివరించారు. కేన్సర్‌తో బాధపడుతున్న నందూ అనే బాలుణ్ని అతని తల్లిదండ్రులు ముంబాయిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి, వెళ్లిపోయారు. చికిత్స కొనసాగించేందుకు ఆస్పత్రి నిరాకరించడంతో నందూ రోజూ పగలంతా ఓ ఫ్యాక్టరీలో పనిచేసి, సాయంత్రం ఆస్పత్రికి వచ్చి, చికిత్స తీసుకునేవాడు. ఈ విషయం తెలిసిన కడిల్స్ ఫౌండేషన్ నందూను అక్కున జేర్చుకుంది. అతనిచేత పని మాన్పించి, పౌష్టికాహారం అందించడం మొదలుపెట్టింది. ఇప్పుడు నందూ కేన్సర్‌నుంచి బయటపడ్డాడు. చక్కగా స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నాడు. అతని ఆశయం- కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా పరిశోధనలు జరిపే సైంటిస్ట్ కావడం!