యువ

గెలుపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ అమ్మాయి దీక్షిత వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చూపిస్తోంది. నిజాం కాలేజీలో బిఏ చదువుతున్న దీక్షిత ఇప్పటికే అనేక ప్రపంచస్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. ప్రస్తుతం ఈ నెల 13నుంచి మెక్సికోలో జరిగే ప్రపంచ యూనివర్శిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ పోటీల్లో గెలుపొందాలనేది ఆమె కల. అయితే ఆరంభంలో ఆమెకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. మెక్సికో వెళ్లి రావడానికి 1,91,300 రూపాయలు కావాలి. దీనికోసం ఉస్మానియా వర్శిటీ అధికారులను అడిగితే, తగినన్ని నిధులు లేనందున సాయం చేయలేమని చేతులెత్తేశారు. టిఆర్‌ఎస్ ఎంపి కవిత జోక్యం చేసుకుని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణనుంచి 1,50,000 రూపాయలు ఇప్పించారు. మిగిలిన డబ్బు సమకూర్చుకుని దీక్షిత టోర్నమెంట్‌కు సమాయత్తమవుతోంది.
వరంగల్‌కు చెందిన దీక్షితలో వెయిట్‌లిఫ్టింగ్ పట్ల మక్కువను ఆమె అంకుల్ గుర్తించారు. ఆ దిశగా ఆమెను ప్రోత్సహించడమే కాదు, స్పోర్ట్స్ స్కూల్‌లో ఆమెకు ప్రవేశం దొరికేందుకు సాయం చేశారు. అది మొదలు వెయిట్‌లిఫ్టింగ్‌లో దీక్షత దూసుకుపోతోంది. 2012 కామన్‌వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో దీక్షత గోల్డ్ మెడల్ సాధించింది. ఆ కేటగిరీలో ప్రపంచంలోనే ఆరో ర్యాంకూ సాధించింది. గత ఆసియా గేమ్స్‌లో దీక్షిత నాలుగోస్థానంలో నిలబడింది. అయితే గాయం కారణంగా ఏడాదినుంచీ ఆమె టోర్నమెంట్లలో పాల్గొనడం లేదు.
ఖాళీగా ఉన్న సమయాల్లో వివేకానంద పుస్తకాలు చదువుతానంటుంది దీక్షిత. ఏకాగ్రత పెరగడానికి ఈ పుస్తకాలు తననెంతగానో ప్రభావితం చేస్తాయంటుంది.